తిరుపతిలో పెళ్లికి సిద్దమవుతున్న జాహ్నవి కపూర్
దివంగత నటి, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కకొంటున్నారు. ఆమె నటించిన ధడక్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా వస్తున్న అవకాశాలను పరిశీలిస్తున్నది. విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ రూపొందించే ఫైటర్ సినిమా కోసం జాహ్నవిని సంప్రదింపులు జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే బిజీ బిజీగా ఉన్న జాహ్నవి తాజాగా పెళ్లి విషయం ప్రస్తావనకు తెచ్చారు.
బ్రైడ్స్ అనే మ్యాగజైన్ కోసం జరిపిన షూట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి గురించి తన భావాలను ప్రకటించారు. నా పెళ్లి సంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. కలియుగ పుణ్యక్షేత్రం తిరుపతిలో నా పెళ్లి జరుగుతుంది. ఆ సందర్భంలో నేను కంజీవరం జరీ చీరను కట్టుకొంటాను అని బ్రైడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

బాహుశా తల్లి శ్రీదేవి కోరిక మేరకు జాహ్నవి పెళ్లి తిరుపతిలో జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. ఇటీవల శ్రీదేవి కోరికను తీర్చడానికి పింక్ సినిమాను తమిళంలో బోనికపూర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అజిత్, శ్రద్ధా శ్రీనాథ్, విద్యాబాలన్ నటించిన సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ధడక్ చిత్రం తర్వాత కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో జాహ్నవి కపూర్ కపూర్ నటిస్తున్నది. అలాగే ఉన్మది, దోస్తానా 2, తలా 60, రుహ్ ఆఫ్జా చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











