పూనమ్ పాండే అరెస్ట్: స్పందించిన బాలీవుడ్ శృంగార తార

బాలీవుడ్ నటి పూనమ్ పాండే అరెస్ట్ వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపింది. మహారాష్ట్రను కరోనావైరస్ వ్యాధి పట్టి పీడిస్తూంటే.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బీఎండబ్ల్యూ కారులో లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా చక్కర్లు కొడుతున్నారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారనే విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. అయితే పోలీసుల కథనాలకు విరుద్ధంగా పూనమ్ ఓ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. తాను అరెస్ట్ కాలేదని చెబుతూ ఆ వార్తలను ఖండించింది.

Recommended Video

Poonam Pandey Condemns Her Arrest News

హీరోయిన్ పూనమ్ పాండే అరెస్ట్.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా..!

 లాక్‌డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా

లాక్‌డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా

లాక్‌డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడంతో కేసు నమోదు చేశారనే వార్త జాతీయ మీడియాలో హైలైట్‌గా మారిన సంగతి తెలిసిందే. కారణం లేకుండా బాయ్ ఫ్రెండ్‌ సామ్ ఆహ్మద్‌తో రోడ్లపై తిరగడం ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీసుల దృష్టికి వచ్చిందని, దాంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారనే వార్త వైరల్ అయింది.

ప్రియుడితో పూనమ్ పాండే

ప్రియుడితో పూనమ్ పాండే

పూనమ్ పాండే, ఆమె ప్రియుడు సామ్ ఆహ్మద్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే కారణంతో ముంబై పోలీసులు వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేసినట్టు, అలాగే వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 51 బీ ప్రకారం కేసు నమోదు చేశారనే కథనం వెలువడింది. ఇంకా పలు కేసులు కూడా నమోదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

నేను అరెస్ట్ కాలేదు

నేను అరెస్ట్ కాలేదు

అయితే తన అరెస్ట్ వార్తల పూనమ్ ఖండించారు. గత రాత్రంతా నేను వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఏకబిగిన మూడు సినిమాలు చూశాను. అయితే ఇంట్లోనే ఉండగా.. నేను అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నట్టు పలువురు నాకు ఫోన్ చేశారు. మీడియాలో కూడా ఆ వార్తను నేను చూశాను. అలాంటి వార్తలు నాపై రావడంతో నేను చాలా బాధపడ్డాను. దయచేసి ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దు. నేను ఇంట్లోనే చక్కగా ఉన్నాను అని పూనమ్ పాండే వెల్లడించింది.

పూనమ్ పాండే కెరీర్

పూనమ్ పాండే కెరీర్

శృంగారతారగా పేరు తెచ్చుకొన్న పూనమ్ పాండే నషా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. 2018లో గోవిందాతో ఆ గయా హీరో, అలాగే శక్తికపూర్‌తో కలిసి ది జర్నీ ఆఫ్ కర్మ అనే సినిమాలో నటించినా లాభం లేకపోయింది. ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో హాట్ హాట్ వీడియోలతో అభిమానులకు పండుగ వాతావారణాన్ని పంచుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X