RajKundra Arrest : పూనం షాకింగ్ రియాక్షన్.. నా 'బాధ'కి ఇది సమయం కాదు!
అశ్లీల సినిమాలు వాటిని ఒక యాప్ లో పెట్టి అమ్మారనే కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భారత శిక్షాస్మృతి, సమాచార సాంకేతిక చట్టం లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అతన్ని సోమవారం రాత్రి నగర పోలీసులు క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. అయితే ఈ వ్యవహారం గురించి పూనం పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

పూనమ్ పాండే ప్రకటన
కుంద్రా అరెస్టుపై స్పందిస్తూ పూనమ్ పాండే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె హృదయం శిల్పా శెట్టి మరియు ఆమె పిల్లల గురించి ద్రవిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. పూనమ్ పాండే ఒక ప్రకటనలో, "ఈ సమయంలో శిల్ప శెట్టి మరియు ఆమె పిల్లల కోసం నా హృదయం ద్రవిస్తుంది, ఆమె ఏమి చేయాలో నేను ఊహించలేను, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను 2019లో రాజ్ కుంద్రా పై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక, అతనిపై గౌరవనీయ హైకోర్టులో కేసు పెట్టానని అన్నారు.

జ్యుడీషియల్ పరిధిలో
ఈ విషయం జ్యుడీషియల్ పరిధిలో ఉంది కాబట్టి నేను నా స్టేట్మెంట్లను ఇక్కడికి పరిమితం చేయడానికి ఇష్టపడతానని అన్నారు. అలాగే పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది, అశ్లీల చిత్రాలు తీయడం, వారిని కొన్ని యాప్‌ల ద్వారా ప్రచురించడం వంటి కేసులో ముంబయి కోర్టు మంగళవారం వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపింది.
RajKundra కొంప ముంచిన మెంటల్ టార్చర్.. తెలివిగా అగ్రిమెంట్లు చేసి ఇలా దొరికేశారు!

23 వరకు పోలీసు కస్టడీ
ఈ 45 ఏళ్ల వ్యాపారవేత్త అశ్లీల చిత్రాలు తయారు చేసి అమ్మడం ద్వారా ఆర్థికంగా లాభం పొందుతున్నట్లు పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. వారు కుంద్రా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, దానిలోని విషయాలను పరిశీలించాలని, అతని వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలను కూడా గమనించాలని పోలీసులు తెలిపారు. కుంద్రాతో పాటు, పోలీసులు మరో నిందితుడు ర్యాన్ తోర్పేను కూడా హాజరుపరిచారు. ఇద్దర్నీ కూడా జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు.

అనుమతి లేకుండా వాడుకున్నారని
నిజానికి పూనమ్ పాండే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టింది. ఆమె తన వీడియోలను రాజ్ కుంద్రా తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారని, వాటిని మిస్‌యూజ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు కూడా ఇప్పుడు రాజ్‌కుంద్రా మెడకి చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అనేక ఆరోపణలు
అయితే గతంలో మహిళలను కించపరిచేలా కుంద్రా పలు వివాదాస్పద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచేవాడు. ఐపీఎల్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రా హస్తం ఉందని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమాని గా వ్యవహరించేవారు, ఆ తర్వాత 2018లో బిట్ కాయిన్ కుంబకోణాలో సైతం రాజ్ కుంద్రా పై ఆరోపణలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











