బాలీవుడ్ తెరపైకి మరో తెలుగు సినిమా.. ఇస్మార్ట్‌గా రెడీ!
తెలుగు సినిమా ఖ్యాతి అంతకంతకూ రెట్టింపవుతూ వస్తోంది. బాహుబలి సిరీస్‌తో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు రాజమౌళి. అలా మొదలైన అడుగులు దేశంలోని అన్ని భాషా చిత్ర వర్గాల చూపును తెలుగు చిత్రసీమ వైపుకు తిప్పుకున్నాయి. ట్రెండ్ ఫాలో అవుతూ విలక్షణ కథలను తెరకెక్కిస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. దీంతో బాలీవుడ్ చూపు టాలీవుడ్ పై పడుతోంది.
తెలుగులో సక్సెస్ సాధించిన పలు చిత్రాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే పలు చిత్రాలను రీమేక్ చేసి భారీ సక్సెస్ సాధించారు. అదే బాటలో ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ రూపంలో బాలీవుడ్ ఆడియన్స్ ముందుంచి లాభాలు ఒడిసిపట్టారు.

గత ఆరు నెలల వ్యవధిలో ఈ పరిణామాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఇదే బాటలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఇస్మార్ట్ శంకర్' రీమేక్ హక్కులను దక్కించుకున్నారని తెలిసింది. రణవీర్ సింగ్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి ఇంకాస్త మాస్ మసాలా అంశాలు జోడించబోతున్నారని సమాచారం.
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ సహా నటీనటులందరికీ ఈ సినిమా ఘనవిజయం అందించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. దీంతో ఈ క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఇప్పటికీ 'ఇస్మార్ట్ శంకర్' అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











