సల్మాన్‌తో పూరీ జగన్నాథ్ క్రేజీ ప్రాజెక్ట్.. ముంబైలో జోరుగా మంతనాలు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సల్మాన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేయడం కోసం పూరి ప్రస్తుతం ముంబైలో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ముంబై చేరుకొన్న సల్మాన్‌తో పూరీ వరుస భేటీలతో కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హిందీలో మల్టిపుల్ ప్రాజెక్టులతో
ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో కాలుపెట్టిన పూరీ జగన్నాథ్.. అమితాబ్‌తో బడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్‌ను ఖాతాలో వేసుకొన్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్‌తో పూరీ జగన్నాథ్ సమావేశమై హిందీ సినిమాపై వేగం పెంచారు.

గతంలో సల్మాన్ ఖాన్‌తో
ఇక సల్మాన్ విషయానికి వస్తే దక్షిణాది పరిశ్రమలో సంచలనం రేపుతున్న దర్శకులపై దృష్టిపెట్టారు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాను వాంటెడ్‌గా రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అప్పటి నుంచి పూరీతో కలిసి పనిచేయాలని సల్మాన్ భావిస్తున్నారు. గతంలో ఒకట్రెండు ప్రాజెక్టులపై చర్చలు జరిగినా వర్కవుట్ కాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

యష్‌తో కూడా చర్చలు
ఇక సల్మాన్ ఖాన్ కంటే ముందు పూరీ జగన్నాథ్ కేజీఎఫ్ హీరో యష్‌తో చర్చలు జరిపారు. కేజీఎఫ్ తర్వాత యష్‌తో ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. అంతా వర్కవుట్ అయితే ప్రభుదేవా తెరకెక్కిస్తున్న రాధే సినిమా తర్వాత పూరీతో సినిమా చేసే అవకాశం ఉంది.
Recommended Video

విజయ్ దేవరకొండతో ఫైటర్
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా షూట్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











