‘సింహా’లో రణ్‌వీర్ సింగ్ సెక్సీ లుక్.. బయటపెట్టిన రోహిత్ శెట్టి!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్వకత్వంలో రూపొందిన టెంపర్ చిత్రం ఆధారంగా బాలీవుడ్‌లో సింహా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రలో రణ్‌వీర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ పాత్ర పేరు సంగ్రామ్ భలేరావు అని తెలిసింది.
రణ్‌వీర్ సింగ్ గెటప్‌కు సంబంధించిన ఫోటోను తాజాగా రోహిత్ శెట్టి బయటపెట్టారు. ఇది రణ్‌వీర్ బర్త్ డే సందర్భంగా నేను ఇచ్చే సెక్సీ గిఫ్ట్ ఇదే. గతంలో కంటే ఇప్పుడు చాలా సెక్సీగా కనిపిస్తున్నాడు అని రోహిత్ శెట్టి ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఈ చిత్రం కోసం రణ్‌వీర్ ప్రత్యేకంగా కండలు పెంచినట్టు సమాచారం. సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ranveer singh simbaa rohit shetty sara ali khan ntr puri jagannadh రణ్‌వీర్ సింగ్ సింహా రోహిత్ శెట్టి సారా అలీ ఖాన్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications