పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చూసి సల్మాన్ ఖాన్ ఏమన్నారో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానుల్లో ఒక్కసారిగా పూనకం వచ్చేస్తుంది. కళ్ళల్లో నిజాయితిగా ఉండే పొగరు, గుండెల్లో మంచితనమే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. అపజయాలు ఎన్ని వచ్చినా.. విమర్శలు ఎన్ని వచ్చినా.. అభిమానులు ఆయన్ని వదల్లేదు. ఇక ట్రెండ్ సెట్ చేసిన గబ్బర్ సింగ్ వచ్చి నేటికి 8 ఏళ్లవుతోంది. అప్పట్లో సల్మాన్ ఖాన్ గబ్బర్ సింగ్ చూసి ఒక కామెంట్ చేశాడు.

గబ్బర్ సింగ్‌‌కు 8 ఏళ్లు: అప్పుడు బాక్సాఫీస్, ఇప్పుడు ట్విట్టర్ బెండు తీస్తూ, 34 మినిట్స్ లోనే రచ్చ

రీమేక్ అంటే నమ్మలేరు..

రీమేక్ అంటే నమ్మలేరు..

బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సినిమా నిజానికి ఒరిజినల్ కథకు అంత దగ్గరగా ఉండదు. దర్శకుడు హరీష్ శంకర్ తన అభిమాన హీరోను ఎలా చూపించాలి అనుకున్నాడో అలానే బిగ్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. కేవలం స్టోరీ లైన్ తో రీమేక్ లో ఇంతలా మార్పులు చేయవచ్చా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరూపించాడు. ఈ సినిమా రీమేక్ అంటే నమ్మడం అంత ఈజీ కాదు.

 పవన్ ట్రెండ్ సెట్టర్..

పవన్ ట్రెండ్ సెట్టర్..

పవన్ కళ్యాణ్ కటౌట్ చూసి అభిమానులు అప్పుడే హిట్టు బొమ్మ అని ఫిక్స్ అయ్యారు. మొదటి రోజు నుంచే సినిమా హౌజ్ ఫుల్ బోర్డ్ లతో దర్శనమిచ్చింది. గబ్బర్ సింగ్ మ్యానియా పక్క రాష్ట్రాలను కూడా తాకింది. దబాంగ్ సినిమాతో పవర్ స్టార్ తన డిఫరెంట్ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేశాడని చాలా మంది సినీ ప్రముఖులు తెలిపారు. బండ్ల గణేష్ ఆ సినిమాతో మంచి లాభాలను అందుకున్నాడు.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
సల్మాన్ ఖాన్ ని కదిలించింది..

సల్మాన్ ఖాన్ ని కదిలించింది..

అప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో దబాంగ్ ఒకటి. అయితే ఆ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే పవన్ కళ్యాణ్ కి పెద్దగా సెట్టవ్వదనే కామెంట్స్ వచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ కూడా పెద్దగా పట్టించుకోలేదట. కానీ సినిమా రిలీజ్ తరువాత ఆ ఫ్యాన్స్ గోల చూసి సల్మాన్ సినిమాపై ఒక లుక్కేశారట. ఆ విషయాన్ని అప్పట్లో ఒక మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సల్మాన్ ఏమన్నాడంటే..

సల్మాన్ ఏమన్నాడంటే..

దబంగ్ సినిమాలో నా యాక్టింగ్ ఎంత డిఫరెంట్ గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని ఏ మాత్రం ఫాలో కాలేదని, అతను నిజంగానే ఒక ట్రెండ్ సెట్ చేశాడని అన్నారు. ఆ మాట అప్పట్లో నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసే కొంతమంది షాకయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X