పూరి జగన్నాథ్ అయితే రెడీ.. ఆయన ఓకే అనాలే గానీ! స్టార్ హీరో కామెంట్స్
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా అంటే ఆ కిక్కే వేరు. కథ, కంటెంట్ పరంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సరికొత్త టేస్ట్ మొదటగా చూపించింది పూరి జగన్నాథ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక టైమ్‌లో సూపర్ డూపర్ హిట్స్ సాధించిన పూరి.. కొద్దికాలం డీలా పడి తిరిగి ఇస్మార్ట్ శంకర్ ట్రాక్ ఎక్కాడు.
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ టాలెంట్ కేవలం టాలీవుడ్ స్టార్ హీరోలకే కాదు, బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం తెలిసిపోవడం.. ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సిద్దపడుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా తన కొత్త సినిమా 'దబాంగ్ 3' ప్రమోషన్స్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్.. పూరి జగన్నాథ్ తనతో సినిమా చేస్తానంటే చేయడానికి సిద్ధమని చెప్పేశారు. దీంతో ఇది చూసి.. పూరి హవా ఇంతలా ఉందా? అంటూ ఆయన అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.

ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించి భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసే పనిలో పడ్డారు పూరి. ఇంతలో సల్మాన్ పూరిపై ఇంట్రెస్ట్ చూపుతుండటం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి.. సల్మాన్ కోరికను పూరి జగన్నాథ్ తీరుస్తాడా? లేదా? అనేది.
మరోవైపు సల్మాన్ ఖాన్.. తన కొత్త సినిమా 'దబాంగ్ 3' పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











