18 years of Pokiri 12 కోట్ల బడ్జెట్.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? పోకిరికి అనుకొన్న మరో టైటిల్ ఏంటో తెలుసా?

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం 18 ఏళ్ల క్రితం సంచలన విజయం నమోదు చేసుకొన్నది. ఏప్రిల్ 28వ తేదీన రిలీజైన ఈ సినిమాలో ఇలియానా డీ క్రజ్, ప్రకాశ్ రాజ్, నాజర్, షియాజి షిండే, బ్రహ్మనందం, సుబ్బరాజు, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్, వైష్ణో అకాడమీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీకి 18 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. బ్లాక్ బస్టర్ సినిమాగా మారిన ఈ మూవీ వెనుక విశేషాల వివరాల్లోకి వెళితే..

పోకిరి సినిమాకు బ్యాక్ డ్రాప్‌గా అమీర్‌పేటలోని సిక్కు దేవాలయం ఏరియాలో ఉండే ఓ సిక్కు యువకుడి యాంగిల్‌లో కథను నడిపించాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేశాడు. ఆ కథ సిక్కు బ్యాక్ డ్రాప్ కావడంతో మహేష్ అభ్యంతరం చెప్పారట. దాంతో ఆ కథను పూర్తిగా మార్చి వేసే మనం చూసిన కథతో సినిమాను ప్రారంభించారు.

18 years of Pokiri Mahesh Babu Puri jagannadh movie become master piece with Telugu Industry Record

ఇక సిక్కు బ్యాక్ డ్రాప్‌తో కథ అనుకొన్నప్పుడు ఈ సినిమాకు మరో టైటిల్ అనుకొన్నారు. కథ మారడంతో పోకిరి అనే టైటిల్ పెట్టుకొన్నారు. అయితే సిక్కు నేపథ్యంగా సాగే కథకు అనుకొన్న టైగిల్ ఉత్తమ్ సింగ్ కేరాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయాలనుకొన్నారు. మహేష్ కథ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పోకిరిగా మనముందుకు వచ్చింది.

18 years of Pokiri Mahesh Babu Puri jagannadh movie become master piece with Telugu Industry Record

పోకిరి సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో మూవీపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ప్రారంభమైంది.

పోకిరి చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి మగధీర సినిమా రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుగా పోకిరి మారింది. ఈ సినిమాకు ఆంధ్రా, నైజాంలో 48 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు వచ్చాయి. ఇక మిగితా రాష్ట్రాల్లో 7 కోట్లు, ఓవర్సీస్‌లో 2.6 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ మొత్తంగా సుమారు 60 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తాయి.

18 years of Pokiri Mahesh Babu Puri jagannadh movie become master piece with Telugu Industry Record
పోకిరి సినిమా 18 ఏళ్ల పూర్తి చేసుకోవడంతో అందరూ ఆ సినిమా గురించిన అనుభూతులను పంచుకొంటున్నారు. హీరో ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాలో మహేష్ బాబు రన్నింగ్ స్టైల్‌ను స్కూల్ కారిడార్లలో ప్రాక్టీస్ చేస్తూ అనుకరించే వాళ్లం. ఆ సమయంలో పిల్లలందరూ మహేష్ బాబు మాదిరిగా పరుగెత్తాలని ప్రాక్టీస్ చేయడం నాకు బాగా గుర్తు. చేతలు ఊపుతూ భారీ అంగలతో పరిగత్తడం మావల్ల కాలేదు. నిజంగా పోకిరి మాస్టర్ పీస్. దిల్‌షుక్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో చూసిన అనుభూతి గుర్తుకు వస్తున్నాయి అంటూ తన ట్వీట్‌లో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X