20 Years Of Pokiri: పోకిరి ప్రభంజనానికి 20 ఏళ్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో మహేశ్‌బాబు సరికొత్త చరిత్ర!

మహేశ్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి ఈరోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి సినిమాగా పోకిరి నిలిచింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల రికార్డులను పోకిరి బద్ధలు కొట్టి చరిత్ర సృష్టించింది. ప్రిన్స్‌గా ఉన్న మహేశ్ బాబును రాత్రికి రాత్రి సూపర్‌స్టార్‌ని చేసి ఆయన క్రేజ్‌ను ఎవరెస్ట్‌కు చేర్చిన చిత్రంగా పోకిరి నిలిచిపోయింది. పోకిరి రెండు దశాబ్థాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, టోటల్ కలెక్షన్స్ పరిశీలిస్తే..

పోకిరి తారాగణం
ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ బ్యానర్లపై మంజుల ఘట్టమనేని, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా పోకిరి సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మహేశ్ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటించారు. ప్రకాష్‌రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్ధి, సయాజీ షిండే, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సత్య ప్రకాష్, సుబ్బరాజ్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

20 Years For Pokiri Super Star Mahesh Babu s Movie Budget Box office Records

పోకిరి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పోకిరి సినిమాకు 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. తొలుత ఈ సినిమాను రవితేజ కోసం పూరీ జగన్నాథ్ సిద్ధం చేశారు. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మహేశ్‌ చెంతకు చేరింది. తొలుత ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్య టైటిల్స్‌ పరిశీలనలోకి వచ్చాయి. అయితే మహేశ్ హీరోగా రావంతో దీనికి పోకిరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత ఆయేషా టాకియా, కంగనా రనౌత్‌లను సంప్రదించారట పూరీ. అయితే వీరిద్దరూ అనివార్య కారణాలతో పోకిరిని రిజెక్ట్ చేయడంతో ఇలియానా అవకాశం అందుకుని టాలీవుడ్‌లో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

పోకిరి రికార్డులు
బాక్సాఫీస్ వద్ద పోకిరి చిత్రం ప్రభంజనం సృష్టించింది. 200 కేంద్రాలలో 100 రోజులు.. 63 కేంద్రాలలో 175 రోజులు, 15 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శించబడింది. కర్నూలులోని భగీరథ థియేటర్‌లో ఏకంగా 500 రోజుల పాటు ప్రదర్శితమై.. ప్రతిరోజు 60 లక్షల రూపాయల షేర్ రాబట్టడం ఒక చరిత్ర. థియేట్రికల్ రన్ ముగిసేసరికి పోకిరికి 70 కోట్ల రూపాయల గ్రాస్.. 42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 40 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ షేర్ సాధించిన తొలి సినిమాగా పోకిరి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 2009లో రామ్ చరణ్ - ఎస్ఎస్ రాజమౌళిల మగధీర రిలీజ్ అయ్యే వరకు ఈ రికార్డు పోకిరి పేరిటే ఉండేది. ఈ సినిమాకు 5 నంది అవార్డులు, 2 ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డులు వరించాయి.

పోకిరి కలెక్షన్స్
నైజాంలో 12.56 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.05 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3.4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.18 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2.7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 3.12 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.2 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 3.64 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2.43 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది పోకిరి.

Read more about: pokiri mahesh babu puri jagannadh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X