35 Chinna Katha Kaadu Collections: 35 చిన్న కథ కాదు భారీ ఓపెనింగ్స్.. నివేదా మూవీకి కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇటీవల కాలంలో రిలీజైన కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడమే కాకుండా కాసుల వర్షం కూడా కురిపించారు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా కోవలో చెందిన 35: చిన్న కథ కాదు మూవీ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

త్రిష వల్ల నా జీవితం అలా నాశనం' ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ నివేద థామస్, యువ హీరో ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు కిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు.

35 Chinna Katha Kaadu Collections Worldwide Rana Nivetha Thomas Movie decent Start at Box Office

చైల్డ్, మదర్ సెంటిమెంట్, విద్యా వ్యవస్థ లాంటి అంశాలను ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను ఎక్కువగా అవుట్ డోర్‌లో షూట్ చేశారు. నివేదా, ప్రియదర్శి లాంటి ఆర్టిస్టులు, ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను మొత్తంగా 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

ఇక రానా దగ్గుబాటి ప్రజెంటర్‌గా ఉండటంత రిలీజ్‌కు ముందే దాదాపు లాభాలను సంపాదించింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటు పలకడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. ఇక ఈ సినిమాను థియేట్రికల్‌ బ్రేక్ ఈవెన్‌ను 3 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 200 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 150 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

35 Chinna Katha Kaadu Collections Worldwide Rana Nivetha Thomas Movie decent Start at Box Office

ఓవర్సీస్‌లో 35 చిన్న కథ కాదు మూవీకి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 40 లొకేషన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. 7600 డాలర్లు వసూలు అయ్యాయి. ఇక తొలి రోజు ఈ సినిమాకు 19 వేల డాలర్లు వసూలు అయినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా 26000 డాలర్లు అంటే.. 22 లక్షల రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్ల వల్ల మౌత్ టాక్ భారీగా స్ప్రెడ్ అవుతున్నది. ఈ చిత్రానికి తుఫాన్, వర్షాలు లాంటి ప్రతికూల పరిస్థితులు దాటుకొని మంచి ఆక్యుపెన్సీ సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 1.2 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X