Pushpa 2 Collections: చరిత్ర సృష్టించిన పుష్ప 2..బాహుబలి 2,జవాన్ రికార్డులు ఫట్..మూవీకి ఎన్ని కోట్లంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాయడమే కాకుండా భారతీయ సినిమా చరిత్రను తిరగరాస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎర్నేని నవీన్, రవి ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా బాహుబలి రికార్డులను అధిగమించడం సంచలనంగా మారింది. రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, శ్రీలీల తదితరులు నటించిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమా ఇండియన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వారం ఈ సినిమా 726 కోట్ల రూపాయలు, రెండో వారం 265 కోట్ల రూపాయలు, మూడో వారం 130 కోట్ల రూపాయలు, నాలుగో వారం 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదో వారం ఈ సినిమా 20 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 1210 కోట్ల రూపాయలు నమోదు చేసింది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ బాక్సాఫీస్ రికార్డుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.

'ప్రభాస్‌ అంటే పిచ్చి.. అతడిని పెళ్లి చేసుకోవాలని ఉంది'

Allu Arjun s Pushpa 2 breaks Baahubali 2 Jawan box Office Records in 32 days of its Release

ఇక హిందీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఫస్ట్ వీక్ ఈ సినిమా 434 కోట్లు, రెండో వారం 200 కోట్లు, మూడో వారం 108 కోట్లు, నాలుగో వారం 58 కోట్లు, 5వ వారం 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 813 కోట్ల రూపాయలు కేవలం హిందీ వెర్షన్ కలెక్ట్ చేసింది. ఉత్తరాదిలో బాహుబలి 2, జవాన్ సినిమా వసూళ్లను అధిగమించి.. టాప్ కలెక్షన్లు సాధించిన నంబర్ వన్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో పుష్ప 2 ప్రభంజనం విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగులో 340 కోట్లకుపైగా రూపాయలను, తమిళనాడులో 80 కోట్ల రూపాయలు, కేరళలో 18 కోట్ల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సౌత్‌లో సుమారుగా 550 కోట్ల రూపాయలను నమోదు చేసి ఆల్ టైమ్ ట్రేడ్ రికార్డులకు చేరువైంది.

ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ సినిమా 15 మిలియన్ డాలర్లు అంటే 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 25 మిలియన్ డాలర్లు అంటే 250 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 1830 కోట్ల రూపాయలను రాబట్టింది.

పుష్ప 2 సినిమా భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ ‌చేసింది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే రూ.1831 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి వసూలు చేసిన 1810 కోట్ల రూపాయలు వసూళ్లను అధిగమించింది. ఇండియాలో జవాన్, యానిమల్, స్త్రీ 2 సినిమాలు సెట్ చేసిన రికార్డులను అధఇగమించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 baahubali 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X