‘ఇద్దరమ్మాయిలతో’ మళయాళ వెర్షన్ రిజల్ట్
హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రాన్ని మళయాళంలో రోమియో-జూలియట్స్ అనే టైటిల్ తో రిలీజ్ చేసారు. అయితే తెలుగులో వచ్చినట్లే అక్కడా రెస్పాన్స్ మిక్సెడ్ గా వచ్చింది. ఓపినింగ్స్ బాగున్నా...రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. సెకండాఫ్ సినిమాలో విషయం లేదని అక్కడ రివ్యూలు వచ్చాయి.
మొదటినుంచి మళయాళంలో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. దాంతో తెలుగులో విడుదల చేసినట్లే అక్కడా భారీగానే సినిమాను విడుదల చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా మొదటి నుంచి బన్ని సినిమాలకు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా దేశముదురు సినిమా మళయాళంలో రికార్డులు క్రియేట్ చేసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా రూపొందించారు. ఈ చిత్రాన్ని బన్నీ-పూరి కాంబినేషన్లో వచ్చిన మంచి స్టైలిష్ ఎంటర్టెనర్‌గా చెప్పుకోవచ్చు. బన్నీ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనపడటంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది.
ఇక డాన్సులు ఇరగ దీసాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని 'పాప రీట' సాంగుకు చిరంజీవి మాదిరి స్టెప్పులేసి దుమ్ము రేపాడు. కేచ కంపోజ్ చేసిన యాక్షన్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. అయితే సినిమా లో కథ,కథనం సరిగా లేకపోవటం సినిమాకు దెబ్బ కొట్టింది.


Click it and Unblock the Notifications











