Amaran Day 4 Collections: రజనీ వేట్టయాన్ రికార్డ్ అమరన్ బ్రేక్.. సాయిపల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు నటించిన చిత్రం అమరన్. స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మించిన ఎమోషనల్ ట్రాజెడీ మూవీ అక్టోబర్ 31న రిలీజై అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

జూ ఎన్టీఆర్‌కు నవంబర్ నెల అంటే భయమెందుకు? యంగ్ టైగర్‌ను భయపెట్టేదెవరో మీకు తెలుసా?
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై నిర్మాత కమల్ హాసన్ భారీ బడ్జెట్‌తో అమరన్ చిత్రాన్ని నిర్మించారు. టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

Amaran Movie Day 4 Expected Box Office Collections Worldwide

తమిళనాడులో అమరన్ చిత్రం తొలి రోజు 17 కోట్ల రూపాయలు, రెండో రోజు 16 కోట్ల రూపాయలు, మూడో రోజు 17 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం తొలి రోజు 2 కోట్లు, 2వ రోజు 1.5 కోట్లు, 3వ రోజు 2 కోట్ల రూపాయలతో మొత్తంగా 6 కోట్ల రూపాయలు రాబట్టింది.

కేరళలో అమరన్ చిత్రం తొలి రోజు 1.5 కోట్లు, 2వ రోజు 1 కోటి రూపాయలు, 3వ రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసి మొత్తంగా 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. మిగితా రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కేరళలో ఊహించిన దానికంటే తక్కువగా కలెక్షన్లు నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

ఇదిలా ఉండగా, తెలుగులో తొలి రోజు 4.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 12.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు రాబట్టింది.

Amaran Movie Day 4 Expected Box Office Collections Worldwide

ప్రపంచవ్యాప్తంగా అమరన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్లు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్ససీలో ఈ సినిమా 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 103 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక నాలుగో రోజు అమరన్ వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ఇండియాలో సుమారుగా 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా 15 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ సినిమా 4వ రోజు 35 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తంగా 135 నుంచి 140 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ నటించిన వేట్టయాన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.

More from Filmibeat

Read more about: amaran sai pallavi diwali 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X