Animal 8 Days Collections 600 కోట్లతో యానిమల్ సంచలనం.. షారుక్, రజనీ రికార్డులపై కన్నేసిన రణ్‌బీర్

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ తారలు రణ్‌బీర్ సింగ్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ నటించిన యానిమల్ సినిమా కలెక్షన్ల హవా కొనసాగుతున్నది. క్రితం రోజులతో పరిశీలిస్తే ఈ సినిమా కలెక్షన్లు కొంత పడిపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్డడీగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో జోష్‌ను పెంచింది. తొలివారం భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండోవారంలోకి ప్రవేశించింది. రెండోవారం తొలి రోజున అంటే 8వ రోజున కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియాలో యానిమల్ సినిమా తొలి వారం కలెక్షన్ల విషయానికి వస్తే.. ఎవరూ ఊహించని కలెక్షన్లు నమోదు చేసింది. హిందీలో ఈ మూవీ 300 కోట్ల రూపాయలు, తెలుగులో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంవతో ఈ చిత్రం తొలివారం 345 కోట్ల రూపాయలను రాబట్టింది.

Animal 8 Days Box office Collection Worldwide: Ranbir Kapoor Movie inching towards 600 crores

యానిమల్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ అంటే నార్త్ అమెరికాలో రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి 10 మిలియన్ డాలర్లకు చేరువైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అంటే.. ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్, యూఏఈ, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా 19 కోట్ల రూపాయలు రాబట్టింది.

యానిమల్ సినిమా 8వ రోజ కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. హిందీ వెర్షన్‌ 22 కోట్ల రూపాయలు వసూలుచేస్తే.. తెలుగులో 1.2 కోట్ల రూపాయుల, తమిళంలో 20 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 24 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Animal 8 Days Box office Collection Worldwide: Ranbir Kapoor Movie inching towards 600 crores
Pushpa 2 టెన్షన్‌లో సుకుమార్, అల్లు అర్జున్? జగదీష్‌ అరెస్ట్‌‌తో పుష్ప 2 పరిస్థితి ఏంటో?

ఇక యానిమల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇండియాలో హిందీ వెర్షన్ 300 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. అన్నిభాషల్లో కలిపి ఈ సినిమా 350 కోట్ల రూపాయలకు చేరువైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 590 కోట్ల రూపాలయకుపైగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 600 కోట్ల క్లబ్‌కు చేరువైంది.

యానిమల్ సినిమా లాభ, నష్టాల విషయానికి వస్తే.. ఈ మూవీ భారీ లాభాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది. 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కలెక్షన్ల జర్నీని ప్రారంభించిన ఈ సినిమా ఇప్పటికే 420 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో 100 శాతం లాభాలతో ముందుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X