30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
హిందీ సినిమా పరిశ్రమలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బడేమియా చోటే మియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మనుషీ చిల్లర్, అలయా ఎప్, సోనాక్షి సిన్హా నటించిన ఈ చిత్రం ఆడియెన్స్ లేకపోవడం థియేటర్ల వెలవెలపోతున్నాయి. ఈ సినిమాకు ఊహించని నష్టాలు రావడం బాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది. ఈ సినిమా ఎన్ని కోట్ల నష్టం నమోదు చేసుకొన్నదనే వివరాల్లోకి వెళితే..
బడే మియా చోటే మియా సినిమా భారీ తారాగణంతోను, అలాగే టాప్ టెక్నిషియన్స్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్స్ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 340 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
AP Elections 2024 పవన్ కల్యాణ్ స్పీచ్ వివాదం.. మహేష్ బాబు రియాక్షన్ ఏంటంటే?

అయితే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ చేసిన ప్రమోషన్స్‌తో మూవీపై బజ్ భారీగానే పెరిగింది. దాంతో తొలి మూడు రోజులు హాలీడేస్ కావడంతో భారీగా ఓపెనింగ్స్ సాధించింది. ఇక ఈ సినిమా తొలి రోజు 16 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్లు, మూడో రోజు 8.75 కోట్లు, నాలుగో రోజు 8.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో తొలివారంలోనే 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తొలివారాంతం తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోలేకపోయింది. దాదాపు రెండు వారాల్లో ఈ సినిమా కేవలం 100 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ మూవీ ఊహించని నష్టాల్లో కూరుకుపోయింది. ఇండియాలో ఈ సినిమా 54 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంటే.. ఇండియాలో 55 కోట్లు, ఓవర్సీస్‌లో 25 కోట్లు కలిపి 80 కోట్ల నికరంగా.. 96 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో టికెట్ రేట్లను గణనీయంగా తగ్గించారు. ఉత్తరాదిలో కేవలం 30 రూపాయలు టికెట్ రేట్‌ను నిర్ణయించారు. ఈ రకంగానైనా ప్రేక్షకులు వస్తారనుకొంటే థియేటర్లకు ముఖం చాటేశారు. దాంతో భారీ నష్టాలతోనే ముగిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా బడ్జెట్ 340 కోట్లు కాగా.. యూకేలో షూట్ చేసినందుకు 70 కోట్ల రూపాయలు రిబేట్ లభించింది. దాంతో 270 కోట్లు మేర కుదించారు. ఇక సినిమాను నష్టాల నుంచి గట్టెక్కించడానికి హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కూడా తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని ప్రాఫిట్ షేరింగ్ సిద్దపడ్డారు.


Click it and Unblock the Notifications











