Bhagavanth Kesari-Leo: బాలయ్య వర్సెస్ విజయ్... ఇద్దరిలో బాక్సాఫీస్ వద్ద గెలుపెవరిదో తెలుసా?

సినిమా లవర్స్ కు ఈరోజు పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. రెండు స్టార్ హీరోల సినిమాలు ఈరోజు థియేటర్లోకి వచ్చేశాయి. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరోవైపు విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో కూడా ఈరోజే థియేటర్లలోకి వచ్చేసింది.ఇక ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి టాక్ తో రెండు సినిమాలు దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేశాయో తెలుసా... ఈ రెండు సినిమాల్లో ఎవరిది పైచేయి సాధించారో ఈస్టోరీలో తెలుసుకుందాం.

రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొంటే... కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ఈరోజు భగవంత్ కేసరి, లియో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి తండ్రి కూతుళ్ల కథాంశంతో తెరకెక్కిన సినిమా కాగా.. మరోకటి లోకేష్ కనగరాజ్ యూనివర్స్ భాగంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా. ఇక ఈ రెండు సినిమాలు పోటా పోటీగా వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో వర్సెస్ భగవంత్ కేసరి విషయానికి వస్తే.. ఎవరిది పైచేయి సాధించారో చూద్దాం.

Balakrishna Bhagavanth Kesar and Vijay Leo Movies Day 1 Box Office Collections Full Details Here

ముందుగా భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ తో పాటు.. బాలయ్య యాక్షన్, డైలాగ్స్ ఉండేలా తెరకెక్కించారు. ఇక ఈ మూవీ రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి రూ.57 కోట్ల బిజినెస్ జరుపుకోగా... ఓవర్సీస్, మిగిలిన రాష్ట్రాల్లో కలిపి... మొత్తం ఈ సినిమా రూ.67 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ.67 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి.

ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలకి వస్తే...67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు 1300 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఇక మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా 14 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రెడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ తో కలుపుకుని 20 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Kajal Remuneration:భగవంత్ కేసరి సినిమాకి కాజల్ షాకింగ్ రెమ్యూనరేషన్.. బాగానే వసూలు చేసిందిగా!
ఇక విజయ్.. లోకేషన్ కనగరాజ్ లియో సినిమాకు వస్తే... ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగానే బిజినెస్ జరుపుకుంది. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలను కలుపుకుని ఈ చిత్రం రూ. 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా మాత్రం రూ. 215 కోట్లు వ్యాపారం నమోదు చేసుకుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.16కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే... లియో సినిమా ఇండియా వైడ్ గా రూ.80కోట్ల గ్రాస్ వసూలు చేయగా... ఓవర్సీస్ లో 60కోట్లకు పైగా వసులు చేసింది. ఇక మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ చూసుకుంటే... 140 కోట్లు దాటేసిందని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ చూస్తే... పైచేయి మాత్రం విజయ్ లియో అని అర్థం అవుతుంది. సింహం వర్సెస్ లియో ఆటలో లియో గెలుపు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X