Bhola Shankar 3 Days Collections: చిరంజీవి కెరీర్‌లో డిజాస్టర్ కలెక్షన్లు ..ఆచార్య కంటే తక్కువగా..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళాశంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అనే పేరున్న మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. అయితే విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ వెనుకడుగు వేయాల్సి వస్తోంది. ఇక నాలుగో రోజు ఈ మూవీకి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే...
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. ఇక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవల తాజాగా ఆయన భోళా శంకర్ అనే సినిమాతో ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీకి మోహర్ రమేష్ దర్శకత్వం వహించారు. దాదాపు 140 కోట్ల ( ప్రచార కార్యక్రమాల ఖర్చుతో కలిపి) భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.

ఇక భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించింది. చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీకి స్వర మహాతి సాగర్ సంగీతం అందించారు. ఇక జబర్దస్త్ నటినటులతో పాటు.. యాంకర్ రష్మి, శ్రీముఖిలు కూడా ఈ సినిమాలో మెరిశారు. ఇక ఈ మూవీలో చిరు, శ్రీముఖీల మధ్య ఖుషి నడుము సీన్ క్రియేట్ చేసి.. ట్రోలింగ్ కు గురయ్యారు.
భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవడంతో.. కలెక్షన్స్ మరీ దారుణంగా పడిపోతున్నాయి. ఈ మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ జరుపుకుంది భోళా శంకర్.

భోళా శంకర్'కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రూ. 3.13 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక రెండు రోజులకు కలిపి ఈ చిత్రం కేవలం రూ. 18.51 కోట్లు షేర్, రూ. 27.45 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక మూడో రోజు కలెక్షన్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి. ఇక చిరంజీవి ఆదివారం కూడా అయిపోయింది.. ఇక వీక్ లో ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టడం కష్టంగానే అనిపిస్తోంది.

భోళా శంకర్ సినిమా 3వ రోజు కలెక్షన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. అతి కష్టం మీద 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీనితో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో కేవలం 40 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ లను మాత్రమే అందుకుంది. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 40 కోట్లకు తగ్గకుండా గ్రాస్ ను అందుకునేవి.

డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఆచార్య సైతం మూడు రోజుల్లో 45 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ భోళా శంకర్ సినిమా మాత్రం కేవలం 40కోట్లు మాత్రమే వసూలు చేసి.. అటు చిరంజీవికి, ఇటు నిర్మాతకు, ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. భోళా శంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 40 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 40.50 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. అయితే ఇప్పట్లో అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











