»   » బాహుబలి-2 తర్వాత.... బాలీవుడ్లో బన్నీ రికార్డ్!

బాహుబలి-2 తర్వాత.... బాలీవుడ్లో బన్నీ రికార్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 చిత్రం ఇప్పటి వరకు బాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి.... చరిత్ర సృష్టించి రూ. 1000 కోట్ల పైచిలుకు వసూళ్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి మూవీ తన రేంజికి తగిన విధంగా రికార్డులు క్రియేట్ చేస్తే.... నాన్ బాహుబలి తెలుగు సినిమాల లిస్టులో బన్నీ మూవీ 'డిజె' బాలీవుడ్ రికార్డ్ నమోదు చేసింది.

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడ జగన్నాథమ్'(డిజె) చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 7 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా హిందీలో థియేటర్ రిలీజ్ కావడం లేదు కానీ..... హిందీ వెర్షన్ టీవీల్లో, ఇంటర్నెట్లో ప్రసారం చేసేందుకుగాను ఈ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది.

భారీ డిమాండ్

భారీ డిమాండ్

మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ నటించిన సినిమాలకు హిందీ టీవీ, డిజిటల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే బన్నీ ‘డిజె' సినిమాకు రికార్డు స్థాయిలో ఇంత భారీ మొత్తం వచ్చినట్లు స్పష్టమవుతోంది.

టీఆర్పీ రేటింగులు

టీఆర్పీ రేటింగులు

గతంలో బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి', రేసు గుర్రం చిత్రాలు హిందీలో బుల్లితెరపై రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. టీఆర్పీ రేటింగులు రికార్డు స్థాయిలో వచ్చాయి. ‘డిజె' సినిమాకు ఇంత రేటు రావడానికి కారణం ఇదే. దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం జూన్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

హీరో అల్లు అర్జున్ భార్య.... బ్యూటిఫుల్ లుక్ (ఫోటోస్)

హీరో అల్లు అర్జున్ భార్య.... బ్యూటిఫుల్ లుక్ (ఫోటోస్)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. హైదరాబాద్ లో H&M అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూం ఓపెన్ చేసిన ఆమె బ్యూటిఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు: అల్లు అర్జున్

ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు: అల్లు అర్జున్

దాదా ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ గురించి ఆసక్తికరకామెంట్ చేసారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
As per the latest reports, the Hindi dubbing rights of Bunny's upcoming action entertainer 'DJ' have been acquired for a whopping Rs 7 crore, the maximum amount offered for any non-Baahubali Telugu film. The Hindi version may not have a theatrical release so this staggering amount is paid only for the Hind satellite and digital rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu