Bubblegum Collections: బబుల్‌గమ్ హిట్టా? ఫట్టా? బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో పాపులర్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల సినీ రంగ ప్రవేశం చేస్తూ నటించిన చిత్రం బబుల్‌గమ్. ఈ సినిమాలో మానస చౌదరీ హీరోయిన్‌గా నటించగా, హర్షవర్ధన్, తేజా జొన్నలగడ్డ, హర్ష చెముడు తదితరులు నటించిన ఈ చిత్రం యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. డిసెంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన బబుల్‌గమ్ సినిమాను భారీగానే తెరకెక్కించారు. క్వాలిటీ విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లతో కలిసి ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించారు.

బబుల్‌గమ్ సినిమా టీజర్, ట్రైలర్లకు రెస్సాన్స్ రావడంతో రికార్డు స్క్రీన్లతో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 750 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 5 కోట్లు షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.
బబుల్‌గమ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రబావం పడింది. ఈ సినిమా మార్నింగ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 25 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 25 శాతం, నిజమాబాద్‌లో 35 శాతం, మహబూబ్ నగర్‌లో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

- ఇక బబుల్‌గమ్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు సంతృప్తికరంగానే నమోదు అయ్యాయి. ఫస్ట్ టైమ్ హీరోల కలెక్షన్లు చూస్తే రోషన్ మూవీకి భారీగానే కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి రూపాయల షేర్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
- ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు.. 80 లక్షల రూపాయల నికర వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 3 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
- బబుల్‌గమ్ చిత్రం మూడో రోజు కూడా కోలుకోలేకపోయింది. ఇండియాలో ఈ సినిమా 50 లక్షల షేర్ అంటే సుమారుగా 70 గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో పెద్దగా కలెక్షన్లు సాధించలేదు.
- ఇక న్యూ ఇయర్ డే రోజున బబుల్‌గమ్ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా 4వ రోజున 50 లక్షల రూపాయలు వసూలు చేసింది.
- 5వ రోజున బబుల్ గమ్ మూవీ భారీగా డ్రాప్ అయింది. ఈ సినిమా ఐదో రోజు 35 లక్షల రూపాయలు వసూలు చేసింి.
Devil Collections డెవిల్ కలెక్షన్లు పేలవంగా.. బింబిసారతో పోల్చితే దారుణంగా!

ఇక బబుల్‌గమ్ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటలంటే.. ఈ చిత్రం కనీసం 5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, రోషన్, మానస కెమిస్ట్రీకి ఆదరణ దక్కితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అధిగమించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను సాధిస్తుందనే విషయం గురించి వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











