Businessman4K Collections బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన మహేష్ బాబు.. బిజినెస్‌మ్యాన్‌కు రికార్డు కలెక్షన్లు!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బిజినెస్‌మ్యాన్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపింది. అయితే తాజాగా మళ్లీ విడుదలైన ఈ చిత్రం ఇటీవల కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్‌లో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల్లో భారీ కలెక్షన్లను, రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా రీ రిలీజ్ సాధించిన రికార్డు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు జన్మదినం సందర్భంగా: సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన బిజినెస్‌మ్యాన్ సినిమాకు భారీ స్పందన లభించింది. ఈ సినిమా నేటితరం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో అత్యాధునిక టెక్నాలజీ, డిజిటల్ ఇంటిగ్రేషన్‌తో 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు భారీ అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. దాంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది.

Businessmans re release official collections worldwide: Mahesh Babu set box office record

బిజినెస్‌మ్యాన్ ఆక్యుపెన్సీ: ఆగస్టు 9వ తేదీన రిలీజైన బిజినెస్‌మ్యాన్4K (BusinessMan4K) మూవీకి భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన స్పెషల్ షోలు హౌస్‌ఫుల్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఉదయం ఆటలకు 90 శాతం అక్యుపెన్సీ, మ్యాట్నీకి 80 శాతం, ఫస్ట్ షోకు 80 శాతానికిపైగా, సెకండ్ షోకు 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు: బిజినెస్‌మ్యాన్4K (BusinessMan4K) మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. నైజాంలో 2.5 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో 35.6 లక్షల గ్రాస్, ఉత్తరాంధ్రలో 42 లక్షలకుపైగా వసూళ్లు, కృష్ణా జిల్లాలో 26.5 కోట్ల గ్రాస్, గుంటూరు జిల్లాలో 31.4 లక్షల గ్రాస్, నెల్లూరు జిల్లాలో 7.13 లక్షల గ్రాస్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 34.2 లక్షల గ్రాస్ కలెక్షన్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15.28 లక్షల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

Businessmans re release official collections worldwide: Mahesh Babu set box office record

అమెరికా, ఇతర ప్రాంతాల్లో: బిజినెస్‌మ్యాన్4K (BusinessMan4K) తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. పలు చోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో 27.3 లక్షల గ్రాస్, మిగితా రాష్ట్రాల్లో 26.8 లక్షల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 35 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు జరిగిన రీ రిలీజ్ సినిమాల్లో భారీ వసూళ్లను సాధించిన రికార్డును మహేష్ బాబు మూవీ సొంతం చేసుకొన్నది.

Businessmans re release official collections worldwide: Mahesh Babu set box office record

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌మ్యాన్ కలెక్షన్లు: బిజినెస్‌మ్యాన్4K (BusinessMan4K) మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో 4.42 కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 35 లక్షల వసూళ్లు, మిగితా రాష్ట్రాల్లో 26.76 కలెక్షన్లు, కర్ణాటకలో 27 లక్షలకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 5.31 కోట్ల వసూళ్లను సాధించడమే కాకుండా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X