Businessman4k collections బిజినెస్‌మ్యాన్ రీ రిలీజ్‌కు సూపర్ క్రేజ్.. మహేష్ బాక్సాఫీస్ రచ్చ ఎలా ఉందంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం బిజినెస్‌మ్యాన్. RR బ్యానర్‌పై RR వెంకట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మహేష్ బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం 2012 జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఈ సినిమాను జన్మదినం సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
40 కోట్లతో నిర్మిస్తే.. లాభం ఎంతంటే?: బిజినెస్‌మ్యాన్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా సుమారు 90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి అందించారు. ప్రస్తుతం ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా టెక్నాలజీలను జోడించి 4K W సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా: మహేష్ బాబు జన్మదినం ఆగస్టు 9వ తేదీన రిలీజ్ కాబోతున్న బిజినెస్‌మ్యాన్4K చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. అమెరికా, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియాలో భారీగా స్పందన కనిపిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్‌తో మంచి కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్: బిజినెస్‌మ్యాన్4K సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ సినిమాను 37 లొకేషన్లలో 55 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. గత రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా కోసం 1850 టికెట్లు అమ్ముడుపోగా 12 వేల డాలర్లు వసూలు అయ్యాయి.
యూకేలో ఓపెనింగ్స్: బిజినెస్‌మ్యాన్4K యూకే అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. లండన్, తదితర ప్రాంతాల్లో భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా కోసం 20 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1600 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా నాలుగు రోజులు ఉండగానే మంచి కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు యూకేలో 10 లక్షల రూపాయలను వసూలు చేసింది.

కెనడా, ఆస్ట్రేలియాలో: బిజినెస్‌మ్యాన్4K సినిమా ఓవర్సీస్ మార్కెట్ కెనడా, ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ అవుతున్నది. ఆస్టరేలియాలో ఒకే లోకేషన్‌లో ఒకే షో కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ సినిమా కోసం 200 టికెట్లు అమ్ముడుపోయాయి. కెనడాలో 3 లొకేషన్లలో 3 షోల కోసం ఏర్పాట్లు జరిగాయి ఇప్పటికి 53 టికెట్లు అమ్ముడుపోయాయి.
హైదరాబాద్‌లో: ఇక హైదరాబాద్‌లో బిజినెస్‌మ్యాన్ 4K సినిమాకు క్రేజీగా స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా కోసం 95 షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఇప్పటికే 78 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. 44 లొకేషన్లలో హౌస్‌ఫుల్స్ కనిపించాయి. ఇప్పటి వరకు 68 లక్షల రూపాయాలు వసూలు చేసింది.

కోటి రూపాయలు క్లబ్‌లో చేరుతుందా?: గతంలో మహేష్ బాబు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేయగా భారీ వసూళ్లను సాధించాయి. పోకిరి, ఒక్కడు దాదాపు కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేశాయి. బిజినెస్‌మ్యాన్4K సినిమా కూడా కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











