Businessman4k collections బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్న బిజినెస్‌మ్యాన్4K.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బిజినెస్‌మెన్ చిత్రం 2012 సంవత్సరంలో రిలీజై భారీ హిట్ సాధించింది. తాజాగా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా 4K టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు భారీగా, రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసి.. రీరిలీజ్ సినిమాల పరంగా సరికొత్త బాక్సాఫీస్ చరిత్రకు సిద్దమైంది. ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బిజినెస్‌మ్యాన్4K (Businessman4K) చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది. ఓవర్సీస్‌లో కూడా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో మంచి రిపోర్టులు వస్తున్నాయి. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరులో హౌస్‌ఫుల్ రిపోర్టులు వస్తున్నాయి.

బిజినెస్‌మ్యాన్4K (Businessman4K) యూకేలో అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి సంబంధించిన 10 లోకేషన్లలో 20 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు 1900 అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమాకు 10 లక్షల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి.
బిజినెస్‌మ్యాన్4K (Businessman4K) అమెరికా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. మొత్తం 39 లొకేషన్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 53 షోలు ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా సినిమాకు సంబంధించి 2200 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 16200 డాలర్లు వసూలు అయ్యాయి.

ఇక హైదరాబాద్‌లో బిజినెస్‌మ్యాన్4K (Businessman4K) అడ్వాన్స్ బుకింగ్ రఫాడిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన 172 షోలు ప్రదర్శిస్తున్నారు.దాదాపు 71 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు 1.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు యూకేలో 10 లక్షలు, అమెరికాలో 13 లక్షల రూపాయలు, ఆస్ట్రేలియాలో 2 లక్షలు, కెనడాలో 1 లక్ష రూపాయలు వసూలు అయ్యాయి. దాంతో ఈ చిత్రం సుమారు 26 లక్షల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











