Dhurandhar 2 Day 16 Collections: 1500 కోట్లతో ధురంధర్ 2 జైత్రయాత్ర.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత దూకుడు కొనసాగిస్తోంది. విడుదలై రెండు వారాలు దాటినా, ఈ సినిమా దూకుడు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, రోజుకో కొత్త మైలురాయి దాటుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1400 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా ఇప్పుడు మరిన్ని రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 15 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 16వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 1 మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మొదటి భాగం కలెక్షన్లను సులభంగా దాటేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా సీక్వెల్స్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి కానీ వాటిని అందుకోవడం కష్టం. అయితే 'ధురంధర్ 2' మాత్రం ఆ అంచనాలను మించిపోయి భారీ విజయాన్ని అందుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ చిత్రానికి రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్‌లో నటన ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటోంది.

Dhurandhar The Revenge Day 16 Expected Box Office Collection Ranveer Singh movie in 1500 Cr club

దర్శకుడు ఆదిత్య ధర్ కథను హై వోల్టేజ్ స్క్రీన్‌ప్లేతో మలచి, థ్రిల్లింగ్ అనుభూతిని అందించాడు. కథనం వేగంగా ముందుకు సాగుతూ ఎక్కడా బోర్ కొట్టనీయకుండా తీర్చిదిద్దడం, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి ప్రముఖులు తమ తమ పాత్రల్లో మెప్పించారు. టెక్నికల్‌గా కూడా 'ధురంధర్: ది రివెంజ్' హైలెవల్ లో నిలిచింది. వికాస్ నౌలఖ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను గ్రాండ్‌గా చూపించి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌ను అందించగా, శివకుమార్ పాణికర్ ఎడిటింగ్ కథను కట్టుదిట్టంగా నడిపించగా, శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ప్రధాన బలం అనే చెప్పాలి.

ఇక రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతూ సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.43 కోట్ల వసూళ్లు సాధించి, ఓపెనింగ్ హైప్‌ను స్పష్టంగా చూపించింది. అనంతరం ఫస్ట్ డేనే రూ.102.55 కోట్లతో హిందీ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేయడం విశేషం. ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ సినిమా వసూళ్ల పరంగా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లు వసూలు చేస్తూ నాలుగు రోజుల్లోనే భారీ మైలురాయిని అందుకుంది.

వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లలో పెద్దగా పడిపోకుండా ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరవ రోజు రూ.56.60 కోట్లు, ఏడో రోజు రూ.48.75 కోట్లు రాబట్టి మొదటి వారాంతానికి రూ.674.17 కోట్ల నెట్ వసూళ్లతో అద్భుత రికార్డు సృష్టించింది. రెండో వారంలో కూడా ఈ చిత్రం అదే జోష్ కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.75 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు, పదకొండో రోజు రూ.68.10 కోట్లు వసూలు చేస్తూ మళ్లీ భారీగా రాణించింది. అనంతరం పన్నెండో రోజు రూ.25.30 కోట్లు, పదమూడు రోజు రూ.27.75 కోట్లు, పద్నాలుగో రోజు రూ.20.10 కోట్లు రాబట్టింది. ఇక 15వ రోజుకి కూడా ఈ సినిమా తన స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగిస్తూ రూ.18.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం గమనార్హం.

వీక్‌డేస్‌లో కూడా ఇలాంటి స్థిరమైన కలెక్షన్లు రావడం ఈ సినిమా స్టామినాను స్పష్టంగా తెలియజేస్తోంది. మొత్తంగా చూస్తే, మొదటి వారం రూ.674.17 కోట్లు, రెండో వారం రూ.263.65 కోట్లు కలిపి ఇప్పటివరకు దేశీయంగా రూ.937.82 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలోనే రూ.1,122.77 కోట్లను దాటడం ఈ సినిమాకి వచ్చిన భారీ రెస్సాన్స్ కు నిదర్శనమిది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'ధురంధర్: ది రివెంజ్' అదే స్థాయిలో ప్రభావం చూపుతోంది. 15వ రోజు విదేశాల్లో రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లను రూ.370 కోట్లకు చేర్చుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ స్పందన లభించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1,492.77 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఆ భయంతోనే సీరియల్స్ మానేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన
ఇక 16వ రోజు (శుక్రవారం) కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీక్ ఎండ్ ప్రారంభం కావడం, హాలీడే ఎఫెక్ట్ కలిసి రావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మళ్లీ గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాక కూడా సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం, ఇప్పుడు మళ్లీ పీక్‌కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల అంచనాల ప్రకారం.. 16వ రోజు ఈ మూవీ సుమారు రూ.40 నుంచి రూ.45 కోట్ల మధ్య నెట్ వసూళ్లు నమోదు చేసే అవకాశముంది.

అదే నిజమైతే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.1000 కోట్ల మైలురాయికి చేరువవుతాయి. గ్రాస్ పరంగా కూడా రూ.1200 కోట్ల మార్క్‌ను దాటే దిశగా వేగంగా పయనించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఓవర్సీస్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1500 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత జోరు చూస్తుంటే 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద రికార్డు సెట్ చేయడానికి సిద్ధంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X