Mr Bachchan Vs Double Ismart .. రవితేజ , పూరి మధ్య విభేదాలు.. కారణం ఆమెనా?
తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలు అలాగే స్టార్ దర్శకులు కూడా ఒకప్పుడు తమ యుక్త వయస్సులో కలిసి చేసిన సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అయ్యినవి చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో అల్లు అర్జున్ - సుకుమార్, రవితేజ - పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లాంటి దర్శక హీరోల కాంబినేషన్ లు చాలానే ఉన్నాయి.
కానీ అప్పట్లో ఎన్నో సినిమాలు చేసిన వారు ఇప్పుడు పలు కారణాలు రీత్యా ఇపుడు తమ బంధాలను బ్రేక్ చేసుకుంటున్నారు. కాగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు పండుగలు లాంగ్ వీకెండ్స్ సమయంలో అధిక సంఖ్యలో సినిమాలు వచ్చి క్లాష్ అవ్వడం అనేది అనాదిగా వస్తూనే ఉంది. ఇలా ఇపుడు ఈ ఏడాది సంక్రాంతికి కూడా చిన్న పెద్ద సినిమాలు వచ్చి అదరగొట్టాయి.

ఇక మళ్ళీ ఈ ఏడాదిలో కొంచెం బిగ్ క్లాష్ ఏదన్నా ఉంది అంటే అది ఈ ఆగస్ట్ 15 క్లాష్ అని చెప్పాలి. కాగా ఈ డేట్ లో మూడు అల్లు అర్జున్ పుష్ప 2 రావాల్సి ఉంది కానీ పలు కారణాలు రీత్యా ఆ చిత్రం డిసెంబర్ కి వెళ్ళిపోయింది. దీనితో ఆ మంచి డేట్ ని ఫైనల్ గా ఒకటి కాదు ఏకంగా నాలుగు చిత్రాలు సొంతం చేసుకున్నాయి.
దీనితో మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ క్లాష్ పడనుండగా ఇందులో రెండు సినిమాల విషయంలో మాత్రం మంచి రసవత్తర వాతావరణం రిలీజ్ కి ముందే కనిపిస్తుంది. కాగా ఆ చిత్రాలే మాస్ మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, అలాగే రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు. మరి ఈ సినిమాల్లో డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ మాత్రం రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరి విషయాల్లో మొదటి నుంచి గుఱ్ఱు గానే ఉన్నారు.
చార్మి రవితేజని, హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టడం చర్చకు దారి తీసింది. కానీ ఇపుడు దీనికి మించి షాక్ ఏదన్నా ఉంది అంటే అది రవితేజ, పూరి జగన్నాథ్ మధ్య మాటలు లేకపోవడం అని వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో అందరికీ తెలుసు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి నుంచి నేనింతే వరకు ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి.

ఇలాంటి ఒక కాంబినేషన్ మధ్య ఈ ఆగస్ట్ బాక్సాఫీస్ చిచ్చు పెట్టింది. నిన్న డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ లో పూరి జగన్ పై వేసిన స్పెషల్ ఏవీ లో రవితేజతో చేసిన సినిమాలు తప్పించడం షాకింగ్ గా మారింది. దీనితో ఈ ఇద్దరు మధ్య కూడా విభేదాలు ఉన్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది తీసుకోలేకపోతున్నారని చెప్పాలి. ఎన్నో సాలిడ్ సినిమాలు చేసిన వీరు ఇప్పుడు దూరంగా ఉండడం అనేది బాధాకరమే అని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో పూరి కాంపౌండ్ నుంచి ఏమన్నా క్లారిటీ ఈ క్లాష్ విషయంలో కానీ రవితేజతో విభేదాలు కోసం కానీ ఏమన్నా క్లారిటీ అందిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











