Game Changer Box Office: గేమ్ ఛేంజర్ ఆల్ టైమ్ రికార్డు.. మెగా అడ్డాలో కలెక్షన్ల సంచలనం
సంక్రాంతి కానుకగా రిలీజైన గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ డైరెక్టర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఆంధ్రాలోని ముఖ్యమైన జిల్లాలో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమా బుకింగ్ అట్టహాసంగానే ప్రారంభమైంది. ఈ సినిమా రాంచరణ్ మార్కెట్ ఏమిటో చెప్పకనే చెప్పింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు బిజినెస్ అంటే సుమారుగా 220 కోట్ల రూపాయల మేర చేయడంతో ట్రేడ్ వర్గాల్లో జోష్ పెరిగింది.

ఇక ఆంధ్రాలో మెగా హీరోలకు అడ్డా నెల్లూరు జిల్లా. ఈ ప్రాంతంలో మెగా హీరో ఏ చిత్రానికైనా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. చిరంజీవి తన కెరీర్ ఆరంభం నుంచి ఈ ఏరియాను బాక్సాఫీస్ అడ్డగా మార్చుకొని కలెక్షన్ల రారాజుగా మారారు. ఇప్పుడు రాంచరణ్ విషయంలోను అదే రికార్డు ప్రూవ్ అయింది.
గేమ్ ఛేంజర్ సినిమాను రికార్డు స్థాయి షోస్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు సిటీలోనే మాత్రమే 103 షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. దీని ద్వారా తొలి రోజు 1,14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఓ ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొంటున్నారు. ప్రీమియర్లకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండగానే ఈ సినిమా టికెట్ల కోసం అభిమానుల పోటెత్తారు. దాంతో ఫ్యాన్స్‌లో సంక్రాంతి ముందే వచ్చిందా? అనేంతగా ఆనందం కనిపించింది.


Click it and Unblock the Notifications











