Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల సునామీ.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ప్రతీ వారం ఎన్ని సినిమాలు రిలీజైనా గానీ.. ఇస్మార్ట్ శంకర్ మూవీ కలెక్షన్ల వరద పారిస్తున్నది. ఏకధాటి పరుగుతో ఇస్మార్ట్ శంకర్ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత 25 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
నైజాం, సీడెడ్‌లో వసూళ్లు
ఇస్మార్ట్ శంకర్ సినిమా నైజాంలో బాక్సాఫీస్‌ను దడదడలాడించింది. ఈ చిత్రం గత 25 రోజుల్లో రూ.15.8 కోట్ల నికర వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో ఈ చిత్రం రూ.5.70 కోట్లు రాబట్టింది. దాంతో మిగితా ప్రాంతాల వసూళ్లపై ఈ రెండు ప్రాంతాల కలెక్షన్లు విశేషంగా ప్రభావం చూపాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రాలో బిజినెస్
ఇక ఆంధ్రా విషయానికి వస్తే, వైజాగ్‌లో రూ.4.51 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.17 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.75 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.07 కోట్లు, గుంటూరులో రూ.2.14 కోట్లు, నెల్లూరులో రూ.1.17 కోట్లతో మొత్తంగా ఈ చిత్రం రూ.35.31 కోట్లు రాబట్టింది.
కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో
ఇక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రేతరంగా కూడా ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.1.80 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.48 లక్షలు, ఓవర్సీస్లో ఈ చిత్రం రూ.92 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 38.56 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రూ. 80 కోట్ల గ్రాస్‌తో
ఇస్మార్ట్ శంకర్‌కు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లకు ఎదురే లేకుండా పోయింది. గత 25 రోజుల్లో ఈ చిత్రం సుమారు 80 కోట్ల గ్రాస్, రూ.38 కోట్ల నికర వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు, సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రం థియేట్రికల్ హక్కుల కోసం రూ.17.8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాదాపు 150 శాతం మేర లాభాలను రాబట్టుకొన్నట్టు సమాచారం.
రూ. 50 కోట్ల నికరం వైపు
ఇస్మార్ట్ శంకర్ ఇదే ఊపును కొనసాగిస్తే, చాలా సులభంగా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ వాస్తవానికి ఆగస్టు రెండో వారంలో భారీ సినిమాలు రిలీజ్ కానున్నడటంతో వసూళ్లకు కొంత బ్రేక్ పడే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్లు రూ.40 వద్ద ఆగిపోవచ్చనే మాట కూడా ట్రేడ్ సర్కిళ్లలో వినిపిస్తున్నది.