కలెక్షన్స్ టాక్: దూకుడు మీద ఇస్మార్ట్ శంకర్.. డీలాపడ్డ డియర్ కామ్రేడ్!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం మూడో వారంలోకి దూసుకెళ్లింది. డియర్ కామ్రేడ్ సినిమాకు అంతగా ఆదరణ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ ఫైర్ మరింత రైజ్ అయింది. ఈ రెండు సినిమాలకు ఒకే పీఆర్ గ్రూప్ ప్రమోషన్ చేసింది. అయితే డియర్ కామ్రేడ్ సినిమా కలెక్షన్లు అంతగా లేకపోయాయనే వార్తల మధ్య ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్‌ను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారనే మాట వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లివే
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇస్మార్ట్ శంకర్ సినిమా గత 12 రోజుల్లో సుమారు రూ.30 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు సమాచారం. ఈ చిత్రం గ్రాస్‌గా చూస్తే రూ.65 కోట్లకుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఓవర్సీస్ మార్కెట్‌ను చూసుకొంటే సుమారు రూ.1.15 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.

రూ.12 కోట్ల లాభంతో దూసుకెళ్తూ
ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.17 కోట్లకు అమ్మినట్టు సమాచారం. దాంతో ఇప్పుడు పూరీ కనెక్ట్స్‌కు సుమారు 12 కోట్ల మేర లాభాన్ని సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు ముందు రామ్ విదేశాలకు వెళ్లాడు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు చేరుకొని సినిమా ప్రమోషన్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

నైజాంలో ఇస్మార్ట్‌గా వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చూస్తే.. ఇస్మార్ట్ శంకర్ నైజాంలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. గత 12 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో సుమారు రూ.10 కోట్లు మేర కలెక్ట్ చేసినట్టు తెలిసింది. సీడెడ్‌లో ఈ చిత్రం రూ.5.25 కోట్లు రాబట్టడం విశేషం. ఇంకా ఈ సినిమా వసూళ్లలో తగ్గుముఖం పట్టకపోవడం సానుకూల అంశంగా మారింది.

ఆంధ్రాలో ఇస్మార్ట్ కలెక్షన్లు
ఇక ఆంధ్రా ప్రాంతంలో వసూళ్లను పరిశీలిస్తే.. నెల్లూరులో రూ.1.03 కోట్లు, గుంటూరులో రూ.1.78 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.85 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 1.55 కోట్లు, తూర్పు గోదావరి - రూ. 1.80 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 3.50 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణ షేర్: రూ. 26.68 కోట్లు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో - రూ. 2.10 కోట్లు, ఓవర్సీర్ - రూ. 1.15 కోట్లు వచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











