twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇస్మార్ట్ శంకర్’కు ఊహించని రెస్పాన్స్.. రికార్డు క్రియేట్ చేసిన రామ్

    |

    టాలీవుడ్‌లోనే స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ఇస్మార్ట్ శంకర్'. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు సంతృప్తికరంగా లేవు.

    పక్కా మాస్ మసాలా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఆయా చోట్ల డిస్టిబ్యూటర్లు తమ డబ్బులను రప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి జోరు మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే 'ఇస్మార్ట్ శంకర్' మొత్తంగా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందీ సినిమా. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ. 1.45 కోట్లను, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబట్టింది.

    iSmart Shankar Reach Rs 70 cr Grass

    ఈ సినిమా కలెక్షన్లు రామ్ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వాస్తవానికి విడుదలకు ముందు ఈ సినిమా నైజాం రైట్స్ రూ. 7.20 కోట్లకు, ఆంధ్రా రైట్స్ రూ. 6.50 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 3.33 కోట్లకు, కర్నాటక రైట్స్ రూ. 1.50 కోట్లకు, అలాగే ఓవర్సీస్ రైట్స్ రూ. 65 లక్షలకు అమ్ముడు పోయాయట. మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు అని చెప్పుకున్నారు. అలాగే, థియేట్రికల్ రైట్స్‌తో కలుపుకుని ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ. 36.18 కోట్లు అని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Tollywood Star talented Puri Jagannath, ram pothineni making iSmart Shankar. This Film Released Last Week. And This Film Running Successfully. This Movie Reach Rs 70 cr recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X