Jana Nayagan Box Office: 30 దేశాల్లో జన నాయగన్.. రికార్డు ఓపెనింగ్స్‌తో విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ ఉంది అనే విషయాల్లోకి వెళితే..

Jana Nayagan Box Office Advance Booking Collections

సూపర్ స్టార్ విజయ్, స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మమితా బైజు లాంటి యాక్టర్లు, అనిరుధ్ మ్యూజిక్, హెచ్ వినోద్ దర్శకత్వంతో కూడిన టెక్నికల్ సిబ్బంది రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
హిందూ అమ్మాయిల మత మార్పిడా? అమీర్ ఖాన్ దిమ్మతిరిగే కౌంటర్
హిందూ అమ్మాయిల మత మార్పిడా? అమీర్ ఖాన్ దిమ్మతిరిగే కౌంటర్

జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోసం తమిళనాడు ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరకు జూలై 23వ తేదీని అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు అడ్వాన్స్ బుకింగ్‌ను భారీగా ప్రారంభించారు. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్సాన్స్ లభిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Recommended For You
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ

జన నాయగన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత వెంకట్ కే నారాయణ్ వెల్లడించారు. ఆయన జాతీయ న్యూస్ ఛానెల్ ఎన్టీటీవీతో మాట్లాడుతూ.. ఈ సినిమాను 30 కి పైగా దేశాల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను 8000 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు.

You May Also Like
Chennai Love Story Business: చెన్నై లవ్ స్టోరి ప్రీ రిలీజ్ బిజినెస్.. కిరణ్ అబ్బవరం మూవీ లాభాల్లోకి రావాలంటే?
Chennai Love Story Business: చెన్నై లవ్ స్టోరి ప్రీ రిలీజ్ బిజినెస్.. కిరణ్ అబ్బవరం మూవీ లాభాల్లోకి రావాలంటే?

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ముఖ్యంగా కర్ణాటక, ఓవర్సీస్‌లో ప్రారంభమైంది. కన్నడ రాష్ట్రంలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటికే 13 వేల టికెట్లతో 1 కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 320k డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో సుమారుగా 3 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఇప్పటి వరకు ఈ సినిమా 4 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X