K Ramp Closing Collection: కే ర్యాంప్ క్లోజింగ్ కలెక్షన్స్.. కిరణ్ అబ్బరవం మూవీకి లాభమా? నష్టమా?
K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో కొత్త కథలతో ముందుకు సాగుతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం పేరు ఎప్పుడూ ముందుంటుంది. తన కెరీర్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో తాజాగా "కే ర్యాంప్ (K Ramp)" సినిమాతో మరోసారి విజయం అందుకున్నాడు. యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుతో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కే ర్యాంప్ (K Ramp)కి లాభమెంత? నష్టమెంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు పరిశీలిస్తే..
సినిమా వివరాలు
హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ్ హీరోయిన్‌గా నటించగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి మాసం, ఎడిటింగ్ చోటా కే. ప్రసాద్, సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.

బడ్జెట్ వివరాలు
నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కే ర్యాంప్ చిత్రానికి దాదాపు 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు లోకేషన్లలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు నిర్మాతలు.
కే ర్యాంప్ ప్రీ రిలీజ్ బిజినెస్
కిరణ్ అబ్బవరం ట్రాక్ రికార్డ్, గతేడాది రిలీజైన క మూవీ వసూళ్ల నేపథ్యంలో కే ర్యాంప్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాలు ప్రకారం.. నైజాం థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్రా, నైజాంలలో 6.25 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.30 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 8.15 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.9 కోట్ల షేర్ (సుమారు రూ.18 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలేశాయి.
సినిమాపై స్పందన
అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "కే ర్యాంప్" మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో యూత్ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో రష్ అవ్వడంతో ప్రారంభ వసూళ్లు బలంగా నిలిచాయి. యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుతో సాగిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్లలోని న్యాచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
యుక్తి తారేజ్ తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఈ జంట కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద పాజిటివ్‌గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం చూపిన విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. చోటా కే. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పేస్ అందించగా, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి.
బాధగా ఉంది.. మిమ్మల్నీ చాలా మిస్ అవుతున్నా: రష్మిక ఎమోషనల్
కే ర్యాంప్ కలెక్షన్స్
కే ర్యాంప్ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. కిరణ్ అబ్బవరం యూత్ ఫాలోయింగ్ కలిసి సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నారు. అలా కే ర్యాంప్ తొలి రోజున ఇండియా వైడ్‌గా 2.25కోట్ల రూపాయలు, 2 వ రోజున 2.75 కోట్ల రూపాయలు, 3వ రోజున 2.35 కోట్ల రూపాయలు, 4వ రోజున 1.85 కోట్ల రూపాయలు, 5వ రోజున 1.3 కోట్ల రూపాయలు, 6వ రోజు 0.97 కోట్ల రూపాయలు, 7వ రోజున 0.93 కోట్ల రూపాయలు, 8వ రోజున1.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక 9వ రోజున 1.8 కోట్ల రూపాయలు, 10వ రోజున 0.75కోట్ల రూపాయలు, 11వ రోజున 0.73 కోట్ల రూపాయలు, 12వ రోజున 0.52 కోట్ల రూపాయలు, 13వ రోజు రూ. 55 లక్షలు, 14వ రోజు రూ. 12 లక్షలు, 15వ రోజు రూ. 22 లక్షలు, 16వ రోజు రూ. 32 లక్షలు, 17వ రోజు 8 లక్షలు, 18వ రోజు రూ. 9 లక్షలు, 19వ రోజు 8 లక్షలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 19.46 కోట్ల రూపాయల నెట్.. 21.77 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా..వర్డల్ వైడ్ గా రూ. 24.37 కోట్లు వసూలు చేసింది.
కే ర్యాంప్ లాభమెంత నష్టమెంత? నష్టమెంత?
వరుస విజయాల్లో ఉన్న కిరణ్ అబ్బవరం .. కే ర్యాంప్ తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్ల ద్వారా రూ.12 కోట్ల షేర్ సాధించింది. అంటే థియేట్రికల్ బిజినెస్‌పై దాదాపు రూ.4 కోట్ల వరకు నికర లాభం వచ్చింది. అదనంగా డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్‌ల ద్వారా మరో రూ.3.5 కోట్ల వరకు ఆదాయం లభించింది.
మొత్తంగా నిర్మాతలకు రూ.9 కోట్లకు పైగా నికర లాభం వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ట్రేడ్ పండితుల అభిప్రాయం ప్రకారం "కే ర్యాంప్" కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో పాటు, OTT రైట్స్ ద్వారా కూడా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ విజయంతో కిరణ్ అబ్బవరం మార్కెట్ మరింతగా పెరిగింది.


Click it and Unblock the Notifications











