Kalki Day 1 Collections కల్కి థియేటర్లు కళకళ.. బాక్సాఫీస్‌పై కాసులు వర్షం.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్రను తీరగరాసే చిత్రంగా రూపొందిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని ప్రారంభించింది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక పడుకోన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రం ఊహకు అందని విధంగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. అయితే జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్లు, బడ్జెట్ వివరాల్లోకి వెళితే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 180 కోట్ల రూపాయలుగా, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 85 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 385 కోట్ల రూపాయలుగా నమోదైంది.

Kalki 2898 AD Day 1 Expected Box Office Collections Worldwide Prabhas movie heading to surpass RRR GBOC

పబ్లిక్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో కల్కి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో 400 స్క్రీన్లు, ఆంధ్రాలో 850 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 1250 స్క్రీన్లలో, హిందీలో 2000 స్క్రీన్లలో, కేరళ, కర్ణాటక, తమిళనాడులో 750 స్క్రీన్లలో కలిపి ఇండియాలో 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 4500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను 8000 నుంచి 10000 మధ్య స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక కల్కి 2898 ఏడీ సినిమాకు అంచనాలకు మంచి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కళకళలాడటంతో రికార్డు స్థాయిలో ఫుట్‌ఫాల్స్ నమోదు అయ్యాయి. దాంతో ఈ మూవీకి సంబంధించిన టికెట్లు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లాంటి మల్టీప్లెక్స్‌లో గురువారం ఉదయం వరకు 12500 టికెట్లు అమ్ముడుపోయాయి.

Kalki 2898 AD Day 1 Expected Box Office Collections Worldwide Prabhas movie heading to surpass RRR GBOC

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాంలో 35 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 3 కోట్ల గ్రాస్, కేరళలో 50 లక్షల గ్రాస్, హిందీలో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో 3.9 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా దేశాల్లో కూడా భారీగానే వసూళ్లు సాధించింది.
'నన్ను పూర్తిగా నిలువునా దోచేశారు.. నా భార్య లేకుంటే 10 కోట్లు నోక్కేసేవాళ్లు'
ఇక కల్కి 2898 ఏడీ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 200 కోట్ల నుంచి 230 కోట్ల మధ్య వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా పాజిటివ్‌గా మారితే ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X