Lenin Overseas Box Office: ఓవర్సీస్‌లో అదరగొట్టిన లెనిన్.. అఖిల్ అక్కినేని మూవీకి ఎన్ని కోట్లంటే?
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జూలై 10వ తేదీన లెనిన్ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. తొలిరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లుగా రిపోర్ట్స్ వస్తుండగా.. ఓవర్సీస్‌లో లెనిన్ వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో లెనిన్ నార్త్ అమెరికాతో పాటు ఓవర్సీస్‌లో తొలిరోజు ఎంత వసూలు చేసిందో పరిశీలిస్తే..
లెనిన్ బడ్జెట్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి లెనిన్ మూవీని దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్ధ సొంతంగా రిలీజ్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో లెనిన్ బ్రేక్ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయల షేర్... 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి లెనిన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లెనిన్‌లను తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్లలో.. కర్ణాటక+ తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 900 స్క్రీన్‌లలో చొప్పున వరల్డ్ వైడ్‌గా 1500కు స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ఇండియాలో లెనిన్ తొలిరోజు కలెక్షన్స్
తొలిరోజు లెనిన్‌కు ఇండియాలో 2414 షోలు ప్రదర్శితమై దాదాపు 455 లక్షల టికెట్లు అమ్ముడై 6.79 కోట్ల రూపాయల గ్రాస్.. 5.90 కోట్ల రూపాయల నెట్‌తో మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3.19 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2.82 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 67 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 10 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశాడు అఖిల్. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి ఒక్క నైజాం ఏరియాలోనే తొలిరోజు లెనిన్‌కు 3.22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో తొలిరోజు వసూళ్లలో దాదాపు 47 శాతం ఒక్క నైట్ షోల నుంచే వచ్చినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
లెనిన్ ఓవర్సీస్ కలెక్షన్స్
లెనిన్ మూవీని నార్త్ అమెరికా, ఓవర్సీస్ ఏరియాలో శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేసింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1,10,000 డాలర్లు (1.05 కోట్ల రూపాయలు) వసూలు చేశాడు లెనిన్. అలాగే ప్రీమియర్స్ + తొలిరోజు వసూళ్లు కలిపి ఒక్క అమెరికాలోనే 200K డాలర్లు (1.91 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే నార్త్ అమెరికా వ్యాప్తంగా తొలిరోజున లెనిన్‌కు 250K (2.38 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా సోషల్ మీడియాలో అంచనాలు వస్తున్నాయి.
ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో లెనిన్‌కు తొలిరోజున 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్‌లో వచ్చిన వసూళ్లు కలిపి లెనిన్ తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాడు. అఖిల్ జోరు చూస్తుంటే వీకెండ్‌లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. పోటీలో ఎలాంటి సినిమాలు లేకపోవడం లెనిన్‌కు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి లెనిన్ ఎంత వసూలు చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications


