ఓ వైపు నిహారికతో డేటింగ్ రూమర్స్? ఆ హీరోయిన్‌తో దొరికిన ప్యారడైజ్ విలన్..

చిత్ర పరిశ్రమలో ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారో? ఎవరు ఎప్పుడు బ్రేకప్ చెబుతున్నారో? అర్ధం కానీ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు కలిసున్న జంటలు తెల్లారేసరికి విడిపోతున్నారు. ఒక ప్రియురాలితో కనిపించిన నటులు గంటల వ్యవధిలో మరో భామ ఒడిలో వాలిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ పరిస్థితి అలాగే ఉంది. ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

డెహ్రాడూన్‌కి చెందిన రాఘవ్ జుయాల్ డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలతో బుల్లితెరపై పాపులర్ అయ్యారు. సోనాలీ కేబుల్ మూవీతో బాలీవుడ్‌లో నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఏబీసీడీ 2, నవాబ్ జాదే, స్ట్రీడ్ డ్యాన్సర్ 3డీ, బహుత్ హువా సమ్మాన్, కిసి కా భాయ్ కిసికి జాన్, కిల్, యుధ్ర తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం కింగ్, హాసల్‌తో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఇందులో నానిని ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా క్రూరంగా కనిపించనున్నారట రాఘవ్.

Raghav Juyal and Shehnaaz Gill sparked dating rumors after Juyal s birthday celebration

అయితే కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ నటి నిహారిక ఎన్ఎం షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలకు లవ్ ఎమోజీ, ఉంగరాన్ని జత చేయడంతో ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అయితే నిహారిక ఎన్ఎం- రాఘవ్ జుయాల్‌లు హిందీలో భాయ్ తేరా స్టార్ హై మూవీలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫోటోషూట్‌లో వీరిద్దరూ పాల్గొన్నారా అన్నది క్లారిటీ రాలేదు.

Recommended For You
Dhamaal 4 Day 1 Collections: ధమాల్ 4 తొలిరోజు కలెక్షన్స్.. అజయ్ దేవగణ్ మూవీకి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?
Dhamaal 4 Day 1 Collections: ధమాల్ 4 తొలిరోజు కలెక్షన్స్.. అజయ్ దేవగణ్ మూవీకి బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

నిహారికతో బంధంపై వస్తోన్న పుకార్లకు చెక్ పడకముందే మరోసారి వార్తల్లో నిలిచారు రాఘవ్. బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్‌తో ఆయన రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. రాఘవ్ జుయాల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోలో వీరిద్దరి బాండింగ్ అలాంటి అనుమానాలను కలిగిస్తోంది. తన బర్త్ డేను పురస్కరించుకుని రాఘవ్ జుయల్ ముంబైలోని ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీ ముగిసి బయటకు వస్తుండగా షెహనాజ్ గిల్, రాఘవ్‌ల కెమెస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.

You May Also Like
భారీగా పెరిగిన శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయం.. ఒక్క నెలకి సంపాదన ఎంతంటే?
భారీగా పెరిగిన శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయం.. ఒక్క నెలకి సంపాదన ఎంతంటే?

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానుల గుంపు మధ్య షెహనాజ్ చేతిని పట్టుకుని ఆమెను జాగ్రత్తగా కారువైపుకు తీసుకెళ్లారు రాఘవ్. దాంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? తమ బంధాన్ని ఇలా బయటపెట్టారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో కలిసి పనిచేసినప్పటి నుంచే షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్‌లు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి నుంచి పలు పార్టీలు, ఫంక్షన్స్‌లో వీరిద్దరూ కలిసి పాల్గొనడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ రూమర్స్‌పై రాఘవ్ కానీ, నిహారిక కానీ స్పందించలేదు. ప్రస్తుతానికి ఇద్దరూ మౌనాన్ని పాటిస్తున్నారు. మరి నిజంగానే షెహనాజ్- రాఘవ్‌లు రిలేషన్‌లో ఉన్నారా? లేక ఇది సోషల్ మీడియా ప్రచారమేనా అన్నది త్వరలోనే తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X