Leo 1st week Collections 500 కోట్ల క్లబ్‌లో లియో.. 7వ రోజు భారీగా పడిపోయిన కలెక్షన్లు!

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో చిత్రం బాక్సాఫీస్‌ను వసూళ్లతో షేక్ చేస్తున్నది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. గత 6 రోజుల్లో కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగించిన లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ కలెక్షన్లకు 7వ రోజు కాస్త అడ్డుకట్ట పడింది. ఈ మూవీ 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే....

లియో చిత్రం గత 6వ రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియా వైడ్‌గా సుమారుగా 280 కోట్లకుపైగా గ్రాస్, 240 కోట్లకుపైగా నికర కలెక్షన్లు వసూలు చేసింది. తమిళనాడులో 166 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 48 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 38 కోట్ల గ్రాస్, కేరళలో 45 కోట్ల గ్రాస్, హిందీలో 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Leo-500-crores

ఇక లియో చిత్రం ఏడో రోజు ఇండియావైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 8 కోట్ల కలెక్షన్లు, కేరళలో 2 కోట్ల కలెక్షన్లు, కర్ణాటకలో 1.5 కోట్ల కలెక్షన్లు, ఏపీ, నైజాంలో 1.5 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల వరకు రాబట్టింది. దాంతో ఇండియావైడ్ ఈ సినిమా 15 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది.

గత ఐదు రోజుల్లో లియో సినిమా వసూలు చేసిన కలెక్షన్ల విషయానికి వస్తే.. 7వ రోజు దాదాపు ఇండియాలో 50 శాతానికిపైగా డ్రాప్ కనిపిస్తున్నది. ఇక ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో వసూళ్లు తగ్గి ఉండవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడానికి అవకాశం ఉంది.

ఇక లియో చిత్రం గత 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 7వ రోజు కలెక్షన్లను కలుపుకొంటే.. ఈ సినిమా 500 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది. వారం రోజుల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలో ఒకటిగా లియో చిత్రం రికార్డుకు చేరువైంది.

Leo-500-crores-collections

లియో సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా 420 కోట్లుగా నిర్దేశించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి చేరుకొన్నది. ఈ సినిమా 220 కోట్ల షేర్‌ను ఇప్పటికే సాధించింది. ఇక ముందు ఏ రేంజ్ లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X