Liger advance booking పూరి జగన్నాథ్ ప్లానింగ్ అదుర్స్.. యూఎస్‌లో మొదలైన కలెక్షన్ల జాతర
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్సు బుక్సింగ్ యూఎస్‌లో మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన అడ్వాన్సు బుకింగ్ వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్
విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. లైగర్ టీమ్‌తో కలిసి విజయ్ దేవరకొండ చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలకు భారీగా అభిమానులు పొటెత్తుతున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన ప్రేక్షకుల అభిమానం వెల్లువెత్తుతున్నది. దాంతో ఈ సినిమాపై క్రేజ్ మరో లెవెల్‌కు చేరినట్టు కనిపిస్తున్నది.

లైగర్ క్రేజ్ చూసి విజయ్ దేవరకొండ థ్రిల్
లైగర్ ప్రమోషనల్ కార్యక్రమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసి విజయ్ దేవరకొండ థ్రిల్ అవుతున్నారు. అయితే తన సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. నేను పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు. కానీ నాపై దేశవ్యాప్తంగా చూపిస్తున్న ప్రేమ, ఆదరణ అర్ధం కావడం లేదు. ఇంత ప్రేమ రావడానికి పైన నుంచి ఏదో ఒక బలమైన శక్తి నాకు అండగా ఉంది అని విజయ్ దేవరకొండ అన్నారు.

భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
ఇక అమెరికాలో పలు ప్రాంతాల్లో భారీగా అడ్వాన్సు బుకింగ్‌లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఆగస్టు 24వ తేదీన ప్రదర్శించేందుకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అడ్వాన్సు బుకింగ్స్, థియేటర్స్ కూడా పెంచుతూ పోతున్నారు.

సినిమార్క్, గెలాక్సీ థియేటర్లలో
అమెరికాలో క్వాలిటీ థియేటర్లలో లైగర్‌ను ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూఎస్‌లో ప్రముఖ థియేటర్ సినీమార్క్ XD థియేటర్‌లో ప్రదర్శించడం విశేషంగా మారింది. అలాగే డల్లాస్‌లోని గెలాక్సీ గ్రాండ్ స్కేప్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా పలు క్వాలిటీ థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు

పూరీ కనెక్ట్స్ ప్లానింగ్ అదుర్స్
లైగర్ సినిమాకు ఏ సినిమాకు లేని విధంగా అడ్వాంటేజేస్ కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో 9 సెప్టెంబర్ వరకు అంటే రెండు వారాల పాటు రిలీజెస్ లేవు. అలాగే సెప్టెంబర్‌లో తెలుగులో భారీ చిత్రాల విడుదలలు కనిపించడం లేదు. కన్నడలో కూడా సెప్టెంబర్‌లో భారీ రిలీజ్ లేవు. తమిళం, మలయాళంలో ఒక వారం పాటు ఎలాంటి రిలీజ్ లేకుండా నడుస్తాయి. ఇలాంటి ప్లానింగ్‌ను పూరీ కనెక్ట్ చేసింది.

అమెరికాలో అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లు
లైగర్ సినిమా రిలీజ్‌కు సమయం ఉండగానే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ చకచకా జరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 126 లొకేషన్లలో 367 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. తాజాగా లైగర్ సినిమా 45K డాలర్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











