Liger అడ్వాన్స్ బుకింగ్ కిర్రాక్.. ఏకంగా థియేటర్ బుక్ చేసిన మహేష్ ఫ్యాన్.. ఎన్ని టికెట్లంటే!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన కనిపిస్తున్నది. ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అత్యధిక వసూళ్లను రాబడుతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతోపాటు హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికరమైన సంఘటనలు ఏమిటంటే?

యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్

యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్

లైగర్ సినిమాకు సంబంధించి అమెరికా ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 235 లొకేషన్లలో 665 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 225K అమెరికా డాలర్లు వసూలు అయ్యాయి. బుధవారం రాత్రి ప్రీమియర్లు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

 ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ సేల్స్

ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ సేల్స్

లైగర్ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రానికి తొలి రోజు భారీగా స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని 55 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. మొత్తం 167 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు 2000 టికెట్లు అమ్ముడుపోయాయి.

ఇండియాలో 4850 షోలు

ఇండియాలో 4850 షోలు

ఇక ఆల్ ఇండియా లెవెల్‌లో కూడా ప్రీమియర్లు, రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్‌ను 4860 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 7 శాతం అక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1.45 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో రికార్డు బుకింగ్స్

హైదరాబాద్‌లో రికార్డు బుకింగ్స్

లైగర్ చిత్రం హైదరాబాద్‌లో కూడా రికార్డు స్థాయిలో కుమ్మేస్తున్నది. హైదరాబాద్‌లో మొత్తం 757 షోలు ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. 54 శాతం అక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ చిత్రం 3.15 కోట్ల వసూళ్లను సాధించింది.

150 టికెట్లు కొన్న మహేష్ బాబు అభిమాని

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో మహేష్ బాబు అభిమాని క్రేజీ పనికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని పంజగుట్టాలో ఉన్న పీవీఆర్ సెంట్రల్ మల్టీప్లెక్స్‌లో ఏకంగా 150 టికెట్లు కొనుగోలు చేశాడు. విజయ్ దేవరకొండ కోసం మహేష్ బాబు చేసిన ఈ పని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. వైరల్ అవుతున్న ట్వీట్ ఇదే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X