Liger total Collections విజయ్ దేవరకొండ మూవీ డిజాస్టర్.. కానీ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. అయితే విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిశాయి. అయితే డిజాస్టర్ టాక్‌లో కూడా విజయ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకుపైగా బిజినెస్
లైగర్ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరందుకోవడంతో భారీగా బిజినెస్ నమోదు చేసింది. నైజాంలో 25 కోట్ల మేరకు బిజినెస్ జరగగా.. సీడెడ్‌లో 9 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.5 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.8 కోట్లు, గుంటూరు జిల్లాలో 5.2 కోట్లు, ఇక కృష్ణా జిల్లాలో 4.3 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2.2 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..
లైగర్ చిత్రానికి కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగానే థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. కర్ణాటకలో 5.2 కోట్లు, తమిళనాడులో 2.5 కోట్లు, కేరళలో 1.2 కోట్లు, ఓవర్సీస్ 7.5 కోట్లు, ఉత్తర భారతంలో 10 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 88.4 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 90 కోట్లుగా నిర్ణయించారు.

15 రోజుల్లో నైజాం, ఆంధ్రాల్లో కలెక్షన్లు
రికార్డు ఓపెనింగ్స్‌తో లైగర్ బాక్సాఫీస్ యాత్ర ప్రారంభమైంది. గత 15 రోజుల్లో నైజాంలో 5.8 కోట్లు, సీడెడ్‌లో 1.85 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.77 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 88 లక్షలు, పశ్చిమ గోదావరిజిల్లాలో 55 లక్షలు, గుంటూరులో 1 కోటి, కృష్ణా జిల్లాలో 69 కోట్లు, నెల్లూరులో 54 లక్షలతో ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం 14 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 40 కోట్ల వరకు నష్టాల్ని నమోదు చేసింది.

హిందీలో లాభాల్లోకి లైగర్
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో వసూలైన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.57 కోట్లు రాబట్టింది.ఇతర భాషల్లో 85 లక్షలు, ఉత్తరాదిరాష్ట్రాల్లో 9.25 కోట్లు, ఓవర్సీస్‌లో 3.42 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీలో తప్ప మిగితా రాష్ట్రాల్లో, భాషల్లో భారీగా నష్టపోయింది.ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 31 కోట్ల షేర్, 61 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో 60 కోట్ల వరకు నష్టాలను నమోదు చేసింది.

విజయ్ దేవరకొండ హిట్ కొడితే..
లైగర్ చిత్రం తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ అందుకొన్నప్పటికీ.. తొలి వారాంతం నిలకడగా వసూళ్లు సాధించింది. దక్షిణాదిలో భారీ వైఫల్యం చెందినా.. హిందీలో దాదాపు బ్రేక్ ఈవెన్ వద్దకు చేరువైంది. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే.. విజయ్ దేవరకొండ రేంజ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉండేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











