Liger day 1 collections డిజాస్టర్ టాక్‌లోను విజయ్ దేవరకొండకు రికార్డు కలెక్షన్లు.. తొలి రోజు ఎంతంటే?

ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే టాక్‌ను పక్కన పెట్టేసి ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో భారీ అక్యుపెన్సీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ అక్యుపెన్సీ


లైగర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 63 శాతానికి పైగా, విజయవాడలో 52 శాతం, గుంటూరులో 64 శాతం, వైజాగ్‌లో 82 శాతం, కాకినాడలో 94 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. నిజమాబాద్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 50 శాతం, మహబూబ్ నగర్‌లో 74 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది.

ఇతర రాష్ట్రాల్లో కూడా

ఇతర రాష్ట్రాల్లో కూడా


ఇక తెలుగేతర ప్రాంతాల్లో లైగర్ తెలుగు వెర్షన్ అంతంత మాత్రంగానే అక్యుపెన్సీని నమోదు చేసింది. బెంగళూరులో 16 శాతం, చెన్నైలో 34 శాతం, నేషనల్ కాపిటల్ రీజియన్ (నోయిడా) 10 శాతం, ముంబైలో 10 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ శుక్రవారం రిలీజ్ కానున్నది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు

ఓవర్సీస్‌లో కలెక్షన్లు


లైగర్ చిత్రం ఓవర్సీస్‌‌లో 300 లొకేషన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా 476k డాలర్లను సొంతం చేసుకొన్నది. ఇక తొలి రోజు కలెక్షన్లతో 650K డాలర్లను వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో తొలి రోజు 74779 డాలర్లు, న్యూజిలాండ్‌లో 2401 డాలర్లతో శుభారంభాన్ని చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు


లైగర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్‌లో కలెక్షన్లను తొలి రోజు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల నుంచి 16 కోట్ల మధ్య షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు


తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో 2.50 కోట్లు రాబట్టింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం 23 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

లైగర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

లైగర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?


ఇక లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.25 కోట్లు, సీడెడ్‌లో 9 కోట్లు, ఆంధ్రాలో 28 కోట్లు బిజినెస్‌తో కలిపి మొత్తం 62 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో రూ.5.2 కోట్ల బిజినెస్, తమిళనాడులో 2.5 కోట్ల బిజినెస్, కేరళలో 1.20 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్‌ 7.5 కోట్లు, ఉత్తర భారతంలో 10 కోట్లతో మొత్తం 89 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 90 కోట్లు కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X