Liger day 2 collections పుష్పను మించి బాక్సాఫీస్ కలెక్షన్లు.. హిందీలో కొనసాగిన విజయ్ దేవరకొండ హవా

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ చిత్ర కలెక్షన్లపై దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా దృష్టిని పెట్టాయి. నెగిటివ్ టాక్‌తో ప్రారంభమైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచేలా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్నది. డిజాస్టర్ టాక్‌లో కూడా తొలి రోజు దక్షిణాదిలో రికార్డులు సృష్టించింది. ఇక తొలి రోజు సాధించిన రికార్డు కలెక్షన్ల తర్వాత లైగర్ సినిమా రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

నెగిటివ్ టాక్ స్రెడ్ కావడంతో

నెగిటివ్ టాక్ స్రెడ్ కావడంతో


లైగర్ చిత్రం తొలి రోజున హౌస్‌ఫుల్ కలెక్షన్లతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సాయంత్రం షోలపై కొంచెం ప్రభావం పడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే తొలి రోజు కలెక్షన్ల కంటే శుక్రవారం వసూళ్లలో భారీ తేడా కనిపించే అవకాశం ఉంది.

డియర్ కామ్రేడ్‌ను మించి కలెక్షన్లు

డియర్ కామ్రేడ్‌ను మించి కలెక్షన్లు


ఇక లైగర్ చిత్రం ఉత్తరాదిలో డియర్ కామ్రేడ్; వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని మించి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం హిందీ ప్రాంతాల్లో పెయిడ్ ప్రివ్యూలతో కలిపి 19 కోట్ల వసూళ్లను సాధించింది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఒక హీరో ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో


లైగర్ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దిమ్మతిరిగే వసూళ్లను తొలి రోజు రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లు, తమిళనాడులో 2.25 కోట్లు, కర్ణాటకలో 1.75 కోట్లు, కేరళలో 1.75 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు నిలకడగా వసూళ్లను సాధించడం గమనార్హం.

హిందీలో ఒకరోజు ఆలస్యంగా

హిందీలో ఒకరోజు ఆలస్యంగా


లైగర్ చిత్రం ఒక రోజు ఆలస్యంగా హిందీలో రిలీజైంది. ఈ చిత్రం సుమారు 4.7 కోట్లు తొలి రోజున, పెయిడ్ ప్రివ్యూల ద్వారా 1.3 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున 5.5 కోట్ల వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వసూళ్లు పుష్ప, RRR సినిమా కంటే ఎక్కువగా రాబట్టడం విశేషం.

రెండో రోజు ఆక్యుపెన్సీ

రెండో రోజు ఆక్యుపెన్సీ


లైగర్ సినిమా అక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 శాతం అక్యుపెన్సీ కనిపించింది. వర్కింగ్ డే రోజున కూడా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డిజాస్టర్ టాక్‌లో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం విశేషంగా మారింది.

 రెండో రోజు కలెక్షన్ల అంచనా

రెండో రోజు కలెక్షన్ల అంచనా


ఇలాంటి పరిస్థితుల్లో లైగర్ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా ఇలా ఉన్నాయి. తెలుగులో 3.5 కోట్లు, హిందీలో 3.82 కోట్లు, తమిళంలో 20 లక్షలు, మలయాళంలో 8 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 7.6 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 లైగర్ లాభాలను ఆర్జించాలంటే..

లైగర్ లాభాలను ఆర్జించాలంటే..


లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లుగా జరిగింది. ఈ చిత్రం తొలి రోజున 32 కోట్లకుపైగా, రెండో రోజు సుమారు 9 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అంటే ఈ చిత్రం రెండు రోజుల్లో సుమారు 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 65 కోట్లు వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X