Liger day 6 collections పూరీ, చార్మీలకు కోలుకోలేని దెబ్బ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నష్టమంటే?
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ చిత్రం భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నది. ఇప్పటికే దారుణమైన నెగిటివ్ జోన్‌లోకి వెళ్లిన ఈ చిత్రం కలెక్షన్లు క్రమంగా క్షీణిస్తూనే ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాల్లో ముగిసే ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నది. ఇక లైగర్ సినిమా గత 6 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హిందీ వెర్షన్ పరిస్థితి ఎలా ఉందంటే?
హిందీ వెర్షన్ లైగర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. వారాంతపు కలెక్షన్లను పోల్చుకొంటే.. మరో 50 శాతానికిపైగా వసూళ్లు క్షీణించాయి. ఈ చ ిత్రం మంగళవారం 1.25 కోట్ల కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం 16.5 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. మరో 4 కోట్లు వసూలు చేసే అవకాశం కనిపిస్తున్నది. హిందీలో లైగర్ క్లోజింగ్ కలెక్షన్లు 20 కోట్ల వద్ద ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గత 6 వారాల్లో
ఇక ఏపీ, నైజాంలో లైగర్ ఆరు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 9.57 కోట్లు, రెండో రోజున 1.54 కోట్లు, మూడో రోజున 1 కోటి, నాలుగో రోజున 58 లక్షలు, ఐదో రోజున 12 లక్షలు, ఆరో రోజున 6 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12.87 కోట్ల షేర్, 21.95 కోట్ల షేర్ సాధించింది.

ప్రాంతాల వారీగా వసూళ్లు ఇలా..
లైగర్ చిత్రం గత 6 రోజుల్లో నైజాంలో 5.65 కోట్లు, సీడెడ్‌లో 1.84 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.74 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 88 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 55 లక్షలు, గుంటూరు జిల్లాలో 1 కోటి, కృష్ణా జిల్లాలో 68 లక్షలు, నెల్లూరులో 53 లక్షలు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాలు
లైగర్ సినిమా తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్లు, ఇతర భాషల్లో 80 లక్షలు, ఉత్తర భారతంలో 7.30 కోట్లు, ఓవర్సీస్‌లో 3.36 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 25.83 కోట్ల షేర్, 54.25 కోట్ల గ్లాస్ వసూళ్లను రాబట్టింది.

లైగర్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?
లైగర్ సినిమా ప్రీ రీలీజ్ బిజినెస్ 88 కోట్లకుపైగా జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 90 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సింది. అయితే ఇప్పటి వరకు 25 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇంకా ఈ చిత్రం 64 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం సుమారు 60 కోట్లకుపైగా నష్టాల్లో ముగియవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











