Liger Collections: RRR, కేజీఎఫ్ రికార్డులు మటాష్.. అన్ని కోట్లతో లైగర్ సంచలనం.. ఇది మాత్రం షాకే!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసేశారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు దేశ వ్యాప్తంగా హవాను చూపించి నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే మరికొందరు హీరోలు కూడా బహు భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. అలా తాజాగా క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి దారుణమైన టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు ఘోరంగా వస్తున్నాయి. కానీ, హిందీలో మాత్రం ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'లైగర్' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం పదండి!

‘లైగర్'గా మారిపోయిన విజయ్
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రమే 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీని ఛార్మీ, పూరీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. అలాగే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

లైగర్ మూవీ బిజినెస్ వివరాలు
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్ల బిజినెస్ అయింది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'లైగర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు బిగ్ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 1.54 కోట్లు షేర్, రూ. 2.95 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది
2 రోజులకు 'లైగర్' మూవీ ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 87 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. రూ. 11.11 కోట్లు షేర్, రూ. 18.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
'లైగర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 11.11 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.80 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 35 లక్షలు వసూలైంది. వీటితో కలిపి 2 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.46 కోట్లు షేర్, రూ. 32.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?
పూరీ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 17.46 కోట్లు వచ్చాయి. అంటే మరో 72.56 కోట్లు వస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.
RRR, కేజీఎఫ్ రికార్డులు మటాష్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లైగర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ స్పందనే వస్తోంది. కానీ, హిందీలో మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే దీనికి అక్కడ రూ. 5.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇలా RRR, కేజీఎఫ్, పుష్ప చిత్రాలకు కూడా ఓపెనింగ్స్ దక్కలేదు. దీంతో 'లైగర్' సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











