Liger రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. ఎన్నికోట్ల బిజినెస్ అంటే
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం విడుదలకు ముందే సంచలనం రేపుతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. లైగర్ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత నమోదు అయ్యిందంటే..

మ్యూజిక్ రైట్స్ సోని చేతికి
లైగర్ మ్యూజిక్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను సోని మ్యూజిక్ సొంతం చేసుకొన్నది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం లైగర్ చిత్రం 14 కోట్ల రూపాయలను చెల్లించి సోని మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో మ్యూజిక్ హక్కులు అమ్ముడు పోవడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

లైగర్ ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు
లైగర్ ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను 65 కోట్లు చెల్లించి డిస్నీ+హాట్‌స్టార్ దక్కించుకొ్నది. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం హక్కులు రికార్డు అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకొన్నది.

లైగర్ థియేట్రికల్ రైట్స్ ఎంతంటే?
ఇదిలా ఉండగా, లైగర్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఏపీ, నైజాం హక్కులు 75 కోట్ల మేరకు అమ్ముడుపోయాయి. ఇక ఉత్తరాదిలో హిందీ వెర్షన్ రైట్స్ కూడా భారీగా రేటు పలికింది. ఈ సినిమా హిందీ హక్కులు 25 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే ఈ బిజినెస్ ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

110 కోట్లు థియేట్రికల్ బిజినెస్
ఇక లైగర్ తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ సుమారు 7 కోట్లకు, తమిళం, కేరళ హక్కులు 8 కోట్లకు అమ్ముడుపోయాయి. అలాగే ఓవర్సీస్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ సినిమా ఓవరాల్‌గా 110 కోట్లుగా నమోదైంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ బిజినెస్ డీల్ జరగడం క్రేజీగా మారింది.

లైగర్ లాభాల్లోకి రావాలంటే..
లైగర్ మూవీ సినిమా ముందు భారీగా బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీగానే అనిపిస్తున్నది. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











