MIB Closing Collections: మా ఇంటి బంగారం క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. లేడి ఓరియెంట్ చిత్రాల్లో దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం 24 రోజుల బాక్సాఫీస్ జర్నీలో 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ నిడిమోరు నిర్మాతగా మారి రూపొందించారు. ఈ చిత్రం గత 25 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తోపాటు యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ మేలవింపుతో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 29 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ మూవీని ట్రాలాలా బ్యానర్ సొంతంగా రిలీజ్ చేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ ప్రాఫిట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Maa Inti Bangaaram Box Office Closing Collections

తెలుగు రాష్ట్రాల్లో మా ఇంటి బంగారం చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి వారం 34 కోట్ల రూపాయలు, రెండో వారం 21 కోట్ల రూపాయలు, మూడో వారం 6 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రాలో 24.5 కోట్ల రూపాయలు, తెలంగాణలో 32.5 కోట్ల రూపాయలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో 57 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Also Read
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ చిత్రం కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 77 కోట్లకుపైగా కలెక్షన్లను ఇండియాలో సాధించింది. సౌత్ ఇండియాలో 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన 8వ చిత్రంగా తెలుగులో 4వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Recommended For You
Jana Nayagan Censor Report: జన నాయగన్ సెన్సార్ రిపోర్ట్.. విజయ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పడంటే?
Jana Nayagan Censor Report: జన నాయగన్ సెన్సార్ రిపోర్ట్.. విజయ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పడంటే?

ఓవర్సీస్‌లో ఈ సినిమాను భారతీయ ప్రేక్షకులు భారీగా ఆదరించడంతో అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లును, ఇతర దేశాల్లో కలిపి 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 24 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 101 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు, ట్రాలాలా బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.

You May Also Like
జానీ మాస్టర్ పెద్ది రెమ్యునరేషన్ 18 లక్షలు.. డ్యాన్సర్ల ఇన్సూరెన్స్‌ కోసం విరాళం
జానీ మాస్టర్ పెద్ది రెమ్యునరేషన్ 18 లక్షలు.. డ్యాన్సర్ల ఇన్సూరెన్స్‌ కోసం విరాళం

సమంత నటించిన ఈ చిత్రం సుమారుగా 47 కోట్ల రూపాయల షేర్ థియేట్రికల్‌గానే వసూలు చేసింది. నాన్ థియేట్రికల్ పరంగా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 29 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తే.. ఈ చిత్రం 82 కోట్ల రూపాయల రెవెన్యూను సంపాదించి పెట్టింది. ఈ సంవత్సరం భారీ లాభాలను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X