Matka Business: మట్కాకు ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే.. వరుణ్ తేజ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరీ జంటగా నటించిన చిత్రం మట్కా. పలాస, శ్రీదేవి డ్రామా సెంటర్ లాంటి హిట్స్ అందించిన కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
Matka Censor Review: మట్కా సెన్సార్ బోర్డు రివ్యూ.. మరో 20 ఏళ్లపాటు వరుణ్‌తేజ్ గురించే!
మట్కా చిత్ర కథ విషయానికి వస్తే.. బర్మా నుంచి శరణార్తిగా వచ్చిన వాసు అనే యువకుడిగా జీవిత కథనే ఈ సినిమా. 70 నుంచి 90 దశకంలో పాపులర్ అయిన మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. ప్రేక్షకులను 70 దశలోకి తీసుకెళ్లడానికి పూర్తిగా భారీ సెట్స్ వేశారు. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.
మట్కా టీజర్, ట్రైలర్‌కు అంచనాలకు మించి రెస్సాన్స్ రావడంతో బిజినెస్ క్రేజీగా జరిగింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా థ్రియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమకు భారీ బ్రేక్ టార్గెట్ సెట్ చేసింది.
వరుణ్ తేజ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 8 కోట్ల రూపాయలకు హక్కులు అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల షేర్, 32 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

ఇక మట్కా మూవీ ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే..ఈ మూవీకి వరుణ్ తేజ్ కెరీర్‌లో హిట్ సినిమా కలెక్షన్లకు సమానంగా ఈ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 2.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా 17.5 కోట్ల రూపాయల బిజినెస్ నమోదు అయింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ 18.5 కోట్ల షేర్, 37 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఈవెన్ సాధించి ఎంత లాభాలను పంచి పెడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











