OG Vs UBS Day 1 Box Office: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత? OG రికార్డును బ్రేక్ చేస్తుందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా రికార్డును అధిగమించాలంటే.. ఫస్ట్ డే ఎంత వసూలు చేయాలనే లెక్కలోకి వెళితే..

OG Vs Ustaad Bhagat Singh

పవన్, హరీష్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ జోడి మళ్లీ రిపీట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? అనే జోష్ మొదలైంది. ఈ సినిమా ట్రేడ్ సర్కిల్స్‌లో భారీగా బిజినెస్ చేసుకొన్నది. దాదాపు 100 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీ రేంజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది.

Ustaad Bhagat Singh Critic Review: ఉస్తాద్ భగత్ సింగ్ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
ఓజీ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 150 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇండియాలో 90 కోట్లకుపైగా వసూళ్లు, ఓవర్సీస్‌లో 60 కోట్ల మేర వసూళ్లు సాధించాయి అని ట్రేడ్ వ్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 90 కోట్ల రూపాయల గ్రాస్, 65 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. నైజాంలో 25 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 39 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
Dhurandhar The Revenge Critic Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
Dhurandhar The Revenge Critic Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్

అయితే ఓజీ చిత్రం 2025 సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. దాంతో ఈ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఓజీ సినిమా టార్గెట్ పెంచేసింది. ఓజీ రికార్డును ఉస్తాద్ తిరగరాస్తుందా? లేదా? అనే విషయం ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్, అభిమానుల్లో భారీగా చర్చ జరుగుతున్నది.

Recommended For You
Sreeleela Remuneration: శ్రీలీలకు రెమ్యునరేషన్.. ఉస్తాద్ భగత్ సింగ్‌కి పారితోషికం ఎన్ని కోట్లంటే?
Sreeleela Remuneration: శ్రీలీలకు రెమ్యునరేషన్.. ఉస్తాద్ భగత్ సింగ్‌కి పారితోషికం ఎన్ని కోట్లంటే?

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ఓజీపై ఉన్న క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదు. అలాగే ధురంధర్ 2 సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొంటున్నది. ధురంధర్ 2 సినిమా భారీ పోటీని ఇస్తున్నది. దాంతో ఈ రెండు అంశాలను అధిగమించి ఓజీ మూవీ తొలి రోజు కలెక్షన్లు అధిగమించాలంటే.. తొలి రోజు 150 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X