OMG 2 Collections: 13 ఫ్లాపుల తర్వాత ఫస్ట్ హిట్.. అక్షయ్ 16వ సెంచరీ.. నెట్ కలెక్షన్లే అన్ని కోట్లా!
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో ఒకరిద్దరు మాత్రమే వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అందులో బడా హీరో అక్షయ్ కుమార్ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించే అతడు.. ఈ మధ్య కాలంలో పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'ఓ మై గాడ్ 2 (OMG 2)' అనే చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిపోర్టును చూద్దాం పదండి!
హిట్ మూవీకి సీక్వెల్‌గా OMG 2: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఓ మై గాడ్ 2 (OMG 2)'. అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణ భాటియా, విపుల్, రాజేష్, అశ్విన్‌లు సంయుక్తిగా నిర్మించారు. ఇందులో యామీ గౌతమ్ హీరోయిన్‌గా, పంకజ్ త్రిపాఠి ముఖ్యమైన పాత్రలో నటించారు. దీనికి విక్రమ్, హన్స్‌రాజ్ తదితరులు సంగీతాన్ని సమకూర్చారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చింది: 2012లో వచ్చిన 'ఓ మై గాడ్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిందే 'ఓ మై గాడ్ 2 (OMG 2)'. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఫలితంగా అక్షయ్ కుమార్ చిత్రం రూ. 150 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
13 ఫ్లాపుల తర్వాత అదిరిందిగా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య కాలంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం అతడు నటించిన చిత్రాలు అన్నీ పరాజయం పాలవుతుండడమే. ఇలా ఈ బడా హీరో ఏకంగా 13 డిజాస్టర్లను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే 'ఓ మై గాడ్ 2 (OMG 2)' చిత్రంతో వచ్చాడు. ఇది మాత్రం అదిరిపోయే రెస్పాన్స్‌తో కలెక్షన్లను కొల్లగొడుతోంది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?: అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2 (OMG 2)' చిత్రానికి మొదటి రోజు రూ. 10.26 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా 2వ రోజు రూ. 15.30 కోట్లు, 3వ రోజు రూ. 17.55 కోట్లు, 4వ రోజు రూ. 12.06 కోట్లు, 5వ రోజు రూ. 17.10 కోట్లు, 6వ రోజు రూ. 7.20 కోట్లు, 7వ రోజు రూ. 5.58 కోట్లు, 8వ రోజు రూ. 6.03 కోట్లు, 9వ రోజు రూ. 10.53 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది.
9 రోజుల్లోనే వంద కోట్లు అవుట్: అక్షయ్ కుమార్ హీరోగా అమిత్ రాయ్ తెరకెక్కించిన 'ఓ మై గాడ్ 2 (OMG 2)' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. 'గదర్ 2' నుంచి కఠినమైన పోటీ ఉన్నా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా 9 రోజుల్లోనే 'ఓ మై గాడ్ 2 (OMG 2)' మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 101.60 కోట్లు నెట్‌తో పాటు రూ. 120 కోట్లు గ్రాస్ రాబట్టింది.

అక్షయ్ ఖాతాలో 16వ సెంచరీ: డివోషనల్ కాన్సెప్టుతో సందేశాత్మకంగా రూపొందిన 'ఓ మై గాడ్ 2 (OMG 2)' చిత్రం రూ. 100 కోట్లు నెట్‌ను సాధించడంతో పలు రికార్డులు నమోదు అయ్యాయి. ఈ మూవీతో అక్షయ్ కుమార్ ఏకంగా 16 సార్లు 100 కోట్లు మార్కును చేరుకున్నాడు. అలాగే, అతడి ఖాతాలో ఇది 34వ హిట్ సినిమా కావడం విశేషం. ఈ హిట్‌తో అక్షయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











