Peddi Day 17 Box Office: వీకెండ్‌లో రాంచరణ్ దూకుడు.. పెద్ది మూవీ లాభాల్లోకి రావాలంటే?
Peddi Box Office Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ఈ సినిమా విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారం బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? థియేటర్లలో విడుదలైన 17వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మూడో శనివారం వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే..
పెద్ది' సినిమా దాదాపు రూ.350 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో థియేట్రికల్ హక్కులకు కూడా డిమాండ్ ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ బెల్ట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్ల హక్కులు కలిపి సుమారు రూ.220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇంత భారీ బిజినెస్ నేపథ్యంలో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.230 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సిన లక్ష్యంతో ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది.

'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా జోరు కొనసాగుతునే ఉంది. తొలి రెండు వారాల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా మూడో వారం మాత్రం తక్కువ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. మూడో శుక్రవారం (16వ రోజు) ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 229.75 కోట్లు కాగా, గ్రాస్ వసూళ్లు రూ.272.05 కోట్లకు చేరుకున్నాయి. అయితే 15 వ రోజుతో పోలిస్తే సుమారు 12.5 శాతం డ్రాప్ కనిపించింది.
ప్రస్తుతం 'పెద్ది'కి ప్రధాన బలం తెలుగు రాష్ట్రాలే అని తాజా కలెక్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 16వ రోజు వచ్చిన రూ.2 కోట్ల గ్రాస్‌లో ఏకంగా రూ.1.75 కోట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచే రావడం విశేషం. అంటే మొత్తం వసూళ్లలో దాదాపు 87 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మిగిలిన భారతదేశం మొత్తం కలిపి కేవలం రూ.9 లక్షలు మాత్రమే రాబట్టగా, కర్ణాటక నుంచి రూ.15 లక్షలు, తమిళనాడు నుంచి కేవలం రూ.1 లక్ష మాత్రమే వచ్చింది. దీంతో సినిమా ప్రభావం ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకే పరిమితమైందని స్పష్టమవుతోంది.
'పెద్ది' సినిమా కలెక్షన్లను భాషల వారీగా చూస్తే.. 16వ రోజు తెలుగు వెర్షన్ రూ.1.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. కానీ, హిందీ వెర్షన్ రూ.10 లక్షలు, కన్నడ, తమిళ వెర్షన్లు కలిపి రూ.5 లక్షల నెట్ కలెక్షన్లతో సరిపెట్టుకున్నాయి. ఈ లెక్కలు చూస్తే.. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఓవర్సీస్ లో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా రోజురోజుకు కలెక్షన్లు పడిపోతున్నాయి. మార్కెట్ పరిస్థితి మాత్రం నిర్మాతలకు నిరాశ కలిగిస్తోంది. 16వ రోజు విదేశీ మార్కెట్ల నుంచి సినిమా కేవలం రూ.5 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్లు రూ.52.60 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.324.65 కోట్లకు చేరుకున్నాయి. కానీ, ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా కూడా ప్రయాణించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా స్ట్రాంగ్ కలెక్షన్లు అందుకున్న అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు అందుకోలేకపోయిందనే చెప్పాలి.
ఇక 17వ రోజు అంచనా కలెక్షన్లు
ఇక 17వ రోజు ( మూడో శనివారం) లైవ్ ట్రెండ్స్ చూస్తే పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌లలో ఇప్పటికే 2,800కు పైగా టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. 16వ రోజు ఇదే సమయానికి కేవలం 1,400 టికెట్లు మాత్రమే అమ్ముడవగా, ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. అలాగే.. ముఖ్యంగా శనివారం ఉదయం, మధ్యాహ్నాం
షోల ఆక్యుపెన్సీ 18 శాతానికి పెరగడం ట్రేడ్ వర్గాలకు ఊరటనిస్తోంది. శుక్రవారంతో పోలిస్తే ఇది బెటర్ స్టార్ అనే చెప్పాలి. సాయంత్రం, రాత్రి షోల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో వీకెండ్‌లో సినిమా కలెక్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం పరిస్థితిని చూస్తే.. పెద్ది 17 రోజు దేశవ్యాప్తంగా రూ. 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య కలెక్షన్లు అందుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వీకెండ్ కాబట్టి ఓవర్సీర్ లో కూడా కలెక్షన్లు పెరిగే అవకాశముంది. విదేశీ మార్కెట్ నుంచి దాదాపు రూ. 50 లక్షల వరకు వసూలు చేసే అవకావముందని, ఇదే జోరు కొనసాగితే మరోసారి మంచి వసూళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే..పెద్ది రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని పెద్ది సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే 450 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి అన్ని కోట్లు వస్తాయో? లేదో? అనేది ఈ వీకెండ్ లో తెలుస్తోంది.


Click it and Unblock the Notifications





