Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

Peddi Box Office Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను అందుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం స్థిరమైన వసూలు రాబడుతోంది. రెండు వారాల బాక్సాఫీస్ రన్‌ను పూర్తి చేసుకున్న 'పెద్ది', ప్రస్తుతం మూడో వారంలోనూ మంచి వసూలు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకూ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మూడో ఆదివారం వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే..

Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో 'కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద తన వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టిన వీకెండ్ లో మాత్రం స్థిరమైన కలెక్షన్లు అందుకుంటుంది. 17వ రోజు (మూడో శనివారం) 'పెద్ది' మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. 16వ రోజు 1.50 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, 17వ రోజు ఏకంగా 30 శాతం పెరుగుదలతో 1.95 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 1,782 షోలలో 17వ రోజు మొత్తం 2.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.

Peddi Day 18 Expected Box Office Collection worldwide Ram Charan Film Box Office Report Eyes Big Weekend

ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతోంది. 17వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1.75 కోట్ల గ్రాస్ రాగా, కర్ణాటక నుంచి రూ.14 లక్షలు, కేరళ నుంచి రూ.10 లక్షలు, తమిళనాడు నుంచి 1 లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఇక మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. 17 రోజుల ముగింపుకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ కలెక్షన్లు 231.45 కోట్ల రూపాయలకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు 274.01 కోట్ల రూపాయలకు చేరుకున్నారు.

ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 52.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 17వ రోజు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం వసూళ్లు 326.86 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక భాషల వారీగా చూస్తే తెలుగు వెర్షన్‌నే ఏకంగా మొత్తం 206 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లతో తెలుగు వెర్షన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. హిందీలో 22.07 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, కన్నడలో 1.79 కోట్ల రూపాయలు, మలయాళంలో 30 లక్షల నెట్ కలెక్షన్లు అందుకుంది రామ్ చరణ్ పెద్ది.

వీక్‌వైజ్ కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి వారంలో 'పెద్ది' 193. 55 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ అందుకుంది. రెండో వారంలో 34.45 కోట్ల రూపాయలు నెట్ రాబట్టింది. సాధారణంగా రెండో వారంలో భారీ డ్రాప్ కనిపించే పరిస్థితుల్లో 'పెద్ది' మాత్రం స్థిరమైన వసూళ్లతో ముందుకు సాగింది. ఇప్పుడు మూడో వారంలోనూ శనివారం వృద్ధి కనిపించడంతో వీకెండ్‌లో మరోసారి మంచి జంప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా 17 రోజుల్లో పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా 326 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

18 రోజు అంచనా కలెక్షన్ల పరిశీలిస్తే.. శనివారం కంటే ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నాం షోల ఆక్యుపెన్సీ 18 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం, రాత్రి షోల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే.. పెద్ది 18 రోజు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్లు అందుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీర్ లో కూడా కలెక్షన్లు పెరిగే అవకాశముంది. విదేశీ మార్కెట్ నుంచి దాదాపు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు చేసే అవకావముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దీంతో ఇండియా నెట్ కలెక్షన్లు 233 కోట్ల రూపాయలకు, గ్రాస్ వసూళ్లు 277 కోట్లకు చేరువ కానున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు 330 కోట్ల రూపాయలకు చేరే అవకాశముంది. ఇదిలా ఉంటే.. పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్ ను దాటేసిందని నిర్మాత, దర్శకులు అధికారికంగా ప్రకటించారు. ఇక 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ది సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే దాదాపు 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.ఈ లెక్కన చూస్తే వీకెండ్ కూడా ఆ మార్క్ దాటడం కష్టమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X