హీరోయిన్లతో రామ్ రచ్చ.. దేత్తడి పోచమ్మ గుడి.. మూడు రోజుల్లో ఎంత రాబట్టారంటే!
థియేటర్స్‌లో 'ఇస్మార్ట్ శంకర్' హంగామా కొనసాగుతోంది. మాస్ ఆడియన్స్ ఈలలు, గోలల నడుమ కాసుల వర్షం కురుస్తోంది. జులై 18 వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతూ మూడో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, పూరి మార్క్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 7.8 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన 'ఇస్మార్ట్ శంకర్' మూడో రోజు ముగిసే సరికి 16.60 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియా వైస్‌గా చూస్తే నైజాంలో 7.36 కోట్లు, సీడెడ్ లో 2.83 కోట్లు, నెల్లూరులో 0.55 కోట్లు, గుంటూరులో 1.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో 81 లక్షలు, కృష్ణాలో 1.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.05 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ సినిమా 36 కోట్ల రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. ఈ మేరకు కలెక్షన్ వివారాలు తెలిపిన నిర్మాత ఛార్మి.. దేత్తడి పోచమ్మ గుడి అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. వసూళ్ల పరంగా వచ్చే వారంలో ఇస్మార్ట్ శంకర్ మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి ఇద్దరు కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











